Fake Currency Notes : షాకింగ్.. దేశంలో పెరిగిన దొంగ నోట్లు.. రూ.500 నోట్లే ఎక్కువ

దొంగ నోట్ల కట్టడికి, బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని మోడీ గతంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లు తెచ్చారు. మరి ప్రధాని మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అనుమానాలు కలగక మానవు.

Fake Currency Notes : దొంగ నోట్ల కట్టడికి, బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని మోడీ గతంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లు తెచ్చారు. మరి ప్రధాని మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అనుమానాలు కలగక మానవు. కేంద్రం ఇన్ని చర్యలు తీసుకున్నా మన దేశంలో ఫేక్ కరెన్సీ విచ్చలవిడిగా చలామణి అవుతోంది.

ఈ పరిస్థితిపై రిజర్వ్ బ్యాంకు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తన తాజా నివేదికలో ఆర్బీఐ కీలక విషయాలను వెల్లడించింది. మన వ్యవస్థలో దొంగనోట్లు పెరిగిపోతున్నాయని నివేదికలో ఆర్బీఐ తెలిపింది. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ.500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. అయితే ఇతర డినామినేషన్ నోట్ల ఫేక్ కరెన్సీ మాత్రం తగ్గిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 39వేల 453 ఫేక్ రూ.500 నోట్లను ఆర్బీఐ గుర్తించింది.

ట్రెండింగ్ వార్తలు