Rajnath Singh: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం

రాజ్‌నాథ్ సింగ్ జమ్ములో మాట్లాడుతూ... “ ఒబామాజీ ఓ విషయాన్ని మర్చిపోవద్దు... " అని అన్నారు.

Rajnath Singh

Rajnath Singh – Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. భారత్‌ (India) లో ముస్లిం మైనారిటీల పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)తో మాట్లాడతానంటూ ఒబామా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.

దీనిపై ఇవాళ రాజ్‌నాథ్ సింగ్ జమ్ములో మాట్లాడుతూ… “ ఒబామాజీ ఓ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రపంచంలోని అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావించే దేశం భారత్ మాత్రమే. ఒబామా తన గురించి తాను కూడా ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నో ముస్లిం దేశాలపై దాడులు చేేశారు ” అని అన్నారు. మరోవైపు, పీవోకే భారత్ లో ఎప్పటికీ భాగమేనని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఒబామా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా చేసిన ఆరోపణలకు ఎటువంటి రుజువులూ లేవని చెప్పారు. అసలు ఆయన పాలనలో అమెరికా 6 సార్లు ముస్లిం దేశాలపై 26,000 బాంబులతో దాడులు చేసిందని విమర్శించారు. అటువంటి వ్యక్తి చెప్పిన మాటలను మనం నమ్మాలా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు షాక్ ఇచ్చేలా ఉన్నాయని చెప్పారు.

Tripura Govt : 75 సరిహద్దు గ్రామాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు .. ప్రభుత్వం కీలక నిర్ణయం