Tripura Govt : 75 సరిహద్దు గ్రామాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు .. ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు గ్రామాలకు స్వాంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది.

Tripura Govt : 75 సరిహద్దు గ్రామాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు .. ప్రభుత్వం కీలక నిర్ణయం

border villages freedom fighters Names

Updated On : June 26, 2023 / 3:16 PM IST

Tripura Govt : త్రిపుర ప్రభుత్వం (Tripura Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు గ్రామాలకు (border villages)స్వాంత్ర్య సమరయోధుల పేర్లు (India freedom fighters names) పెట్టాలని భావిస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించినవారి పేర్లు సరిహద్దు గ్రామాలకు పెట్టాలని దాని 75 సరిహద్దు గ్రామాల పేర్లు మార్చి దేశ స్వాతంత్ర్యద్యోమంలో ప్రాణత్యాగం చేసినవారి పేర్లు పెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆదివారం (జూన్,2023) సీనియర్ అధికారి ప్రకటించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి (75 years of the country’s independence )అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవం’( ‘Azadi Ka Amrit Mahotsav’)లో భాగంగా త్రిపుర వ్యాప్తంగా మొత్తం ఎనిమిది జిల్లాల్లో విస్తరించి ఉన్న 75 సరిహద్దు గ్రామాలకు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని నిర్ణయించింది.

Manik Rao Thackeray : బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. విపక్షాల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు : మాణిక్ రావు థాక్రే

దీని కోసం ఏఏ గ్రామాలకు ఏ సమరయోధుడి పేరు పెట్టాలనే విషయాన్ని ఇప్పటికే సిద్ధం చేశామని సాంస్కతిక వ్యవహారాల కార్యదర్శి పీకే చక్రవర్తి తెలిపారు.దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లను రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి పీకే చక్రవర్తి (Information,Cultural Affairs Secretary PK Chakravorty)ఆదివారం తెలిపారు.

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లను రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి పీకే చక్రవర్తి ఆదివారం తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చక్రవర్తి తెలిపారు.

Air India Flight : జైపూర్ లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ చేసేందుకు నిరాకరించిన పైలట్

స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం చేసిన కృషిని గుర్తుచేసుకొనే ఈ కార్యక్రమం జులైలో ప్రారంభమై ఆగస్టు15 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఏ గ్రామానికి ఏ సమరయోధుడి పేరు పెడతామో ఆ గ్రామంలో ఆ అమరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని..అలాగే ఆ యోధుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరపు సన్మానిస్తామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో భాగంగా మారథాన్, సైకిల్ ర్యాలి, క్రాంతివీర్ సంగీత కచేరి, సిట్ అండ్ డ్రా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని..స్వాతంత్ర్య యోధుల జీవితాలను నాటకాల రూపంలో ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ 75 గ్రామాలన్నింటిని రోడ్డు మార్గంతో అనుసంధానం చేస్తామని..రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలను 100శాతం అమలు చేసేలా త్రిపుర ప్రభుత్వం చూస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సీఎం మాణిక్ సాహా (CM Manik Saha) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా(Chief Secretary JK Sinha), ఇతర ఉన్నతాధికారులతోను సమావేశం అయి అన్ని విషయాలు చర్చించారు.