కరోనా ఎఫెక్ట్: వారికి నాలుగు నెలల శాలరీ ముందుగానే!

  • Publish Date - March 27, 2020 / 01:14 AM IST

దేశంలో కరోనాపై సమర్థవంతంగా పోరాడుతున్న ముఖ్యమంత్రుల్లో ఒకరు నవీన్ పట్నాయక్. కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న ఒడిశా ప్రభుత్వం కరోనా పాజిటావ్ కేసులను పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌పై పోరాటంలో వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలు చేసిన కృషికి ప్రశంసల చిహ్నంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల ముందస్తు జీతం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. 

ఒడియాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విడుదల చేసిన వీడియో క్లిప్‌లో.. “కరోనావైరస్ మొత్తం మానవాళిని భయపెడుతుంది. కరోనాకు వ్యతిరేకంగా జరిగుతున్న యుద్ధంలో మా వైద్యులు, పారామెడిక్స్ మరియు (ఇతర) ఆరోగ్య కార్యకర్తలు చాలా కష్టపడి పని చేస్తున్నారు. వారి త్యాగం, అంకితభావం, సేవను అంచనా వేయలేము. ఈ క్లిష్ట సమయంలో వారు రాత్రిబవళ్లు కష్టపడి పని చేస్తున్నారు. వారికి నేను, ఒడిశా ప్రజలు అండగా నిలుస్తాము”. అంటూ చెప్పుకొచ్చారు. 

వారిని మేము గౌరవిస్తున్నాం.. అంటూ చేతులెత్తి నమస్కారం అని చెప్పిన ముఖ్యమంత్రి.. “మీ కోసం, మీ కుటుంబం కోసం, వైద్యులు, పారామెడిక్స్ మరియు అన్ని ఆరోగ్య కార్యకర్తలకు ఏప్రిల్, మే, జూన్ మరియు జూలై నెలలకు సంబంధించి జీతాలను ఏప్రిల్ నెలలోనే ఇస్తాము” అని నవీన్ పట్నాయక్ ప్రకటించారు.

ఈ సంధర్భంగా.. ‘డాక్టర్లు మరియు ఆరోగ్య కార్యకర్తలతో గౌరవంగా వ్యవహరించాలని, వారి పనిలో అడ్డంకులు సృష్టించవద్దంటూ సాధారణ ప్రజలను అభ్యర్థిస్తున్నాను. అడ్డంకులను సృష్టించే లేదా వారిన అగౌరవపరిచే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించాను’అని హెచ్చరించారు.

Also Read | గాంధీలో కరోనా చికిత్సలే..ఉస్మానియాకు పలు విభాగాల తరలింపు