మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చినవారికి ఒడిషా సీఎం విజ్ఞప్తి

  • Publish Date - April 4, 2020 / 05:57 AM IST

ఒడిషా రాష్ట్రం నుంచి ఢిల్లీ నిజాముద్దీన్  మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారంతా  స్వచ్ఛందంగా ముందుకు  వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని  ఒడిశా  సీఎం నవీన్‌ పట్నాయక్‌ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరైన వారు స్వచ్ఛందంగా 104 హెల్ఫ్‌లైన్‌కు కాల్‌ చేసి సమాచారం తెలపాల్సిందిగా సీఎం కోరారు.  వారు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదని…రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.  

ఒడిశా రాష్ట్రం నుంచి కూడా వంగదలాది మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో నిర్వహించిన తబ్లిగీ జమాతే ఈవెంట్‌కు హాజరైనట్లుగా సమాచారం. వీరి ఆచూకీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Also Read |  హృదయవిదారకం, 13ఏళ్ల కొడుకు అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన తల్లి