Defeated Sarpanch Candidate Digs Up Road..removes Street Lights
defeated sarpanch candidate digs up road and removes street lights : ఎన్నికల్లో ఓటు వేయకపోతే వారితో మాట్లాడటం మానేస్తారు పోటీ చేసిన అభ్యర్థులు కొంతమంది. లేదా కోపగించుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఊరందరిపై కక్ష పెంచుకున్నాడు. ఒడిషాలోని గంగబడ గ్రామంలో సర్పంచ్ గా గెలవటానికి తనకు ఓటు వేసి గెలిపించలేదని..గ్రామస్తులందరిమీద కక్షకట్టాడు. ఆ కక్షతో ఏకంగా రోడ్డు తవ్వేసి అడ్డంగా రాళ్లు పెట్టాడు. అంతేకాదు ఏకంగా ఊరంతా కరెంట్ కట్ చేసి తన కక్ష తీర్చుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘనకార్యం చేసిన సదరు వ్యక్తిపై గ్రామస్తులంతాకలిసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సరదు ఓడిపోయిన వ్యక్తి ఘనకార్యం వైరల్ గా మారింది.
ఒడిశాలోని బరంపురంలో సమీపంలోని బరిక్ శబర్ అనే వ్యక్తి గంగబడ పంచాయతీ ఎన్నికల్లో హరిబందు ఖర్జీపై పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో గ్రామస్థులపై బరిక్ శబర్ కోపంతో రగిలిపోయాడు.నానా తిట్లు తిట్టాడు. అక్కడితో ఊరుకుంటే విషయమే ఉండేదికాదు. తనకు మద్దతుఇచ్చిన వ్యక్తులతో కలిసి గ్రామంలోకి వచ్చి పోయే రోడ్డుపై పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డంగా పెట్టి దానిని దిగ్భందించాడు. అంతేనా.. గంగబండ నుంచి ఐదు గ్రామాలకు వెళ్లే దారిని తవ్విపారేశాడు. మరోదారిలో పెద్ద పెద్ద బండరాళ్లను అడ్డంగా పేర్చి గ్రామస్థుల్ని నానా తిప్పలు పెట్టాడు. అంతేనా..గ్రామంలో రాత్రి సమయంలో వీధిలైట్లు అన్ని ఆర్పేశాడు. ఇతను చేసిన ఘనకార్యం వల్ల ప్రతీరోజు వ్యవసాయ పనులు చేసుకోవటానికి వచ్చిపోయేవారికి నానా కష్టాలు ఏర్పడ్డాయి.
ఇవన్నీ చేసింది బరిక్ శబర్ అని తెలుసుకున్న గ్రామస్తులు అతనిపై మండిపడ్డారు.ఇవేం పనులు అని ప్రశ్నించారు.నిలదీశారు.దానికి శబర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. నాకు ఓట్లు వేయనందుకు ఇలా జరగాల్సిందే అంటూ సమాధానం చెప్పాడు.దీంతో గ్రామస్తులంతా కలిసి బరిక్ భవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదుచేశారని తెలిసిన బరిక్ శబర్ ఊరు వదిలిపెట్టి పరారయ్యాడు.
ఈ వింత ఘటనపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు బరిక్ శబర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. స్థానిక అధికారులతో కలసి గ్రామ రహదారిని తిరిగి నిర్మింటానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా ఒడిశాలోని గంగబడ పంచాయితీ ఏపీ సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరిగాయి. ఈ ఎన్నికల్లో ఖర్జీ గెలవడం ఇది రెండోసారి. సబర్‌పై 196 ఓట్ల తేడాతో గెలుపొందారు.