Operation To Cobra : నాగుపాము పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూత..ఆపరేషన్ చేసిన తొలగించిన డాక్టర్లు

నాగుపాము పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూతను డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించారు.

Doctors conduct surgery cobra to remove plastic cap from abdomen : ఒడిశాలోని భువనేశ్వర్ లో ఓ నాగుపాముకు డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేసి దాని ప్రాణాలు కాపాడారు. ఎలా ఇరుక్కుందో తెలీదుగానీ ఓ సారా సీసా మూత నాగుపాము పొట్టలోకి వెళ్లి ఇరుక్కుపోయింది. దీంతో పాపం ఆ నాగుపాము అనారోగ్యానికి గురి అయ్యింది. నాగుపాముకి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేసి, దాని పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూతను తొలగించారు. ప్రస్తుతం డాక్టర్ ల అబ్జర్వేషన్ లో ఉంది. పాము ఆరోగ్య పరిస్థితులను దాదాపు వారం రోజుల పాటు పరిశీలించనున్నారు. నాలుగు రోజుల తర్వాత దానికి ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా ఇచ్చి, క్రమంగా కోలుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also read : Snake : పాము కాటుకుగురైన వెంటనే ఏంచేయాలో తెలుసా?..

ఈ పాము సర్జరీకి సంబంధించిన ఘటన వివరాల్లోకి వెళితే..స్థానిక వాసుదేవ్‌ నగర్‌లోని నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం వద్ద ఓ గదిలో మూడున్నర అడుగుల నాగుపాముని అక్కడే పనిచేస్తున్న భవర నిర్మాణ కార్మికులు చూశారు. వెంటనే స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు.

వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. కానీ పాము ఏదో తేడాగా ఉందని గుర్తించారు. దాన్ని పరిశీలించారు. దీంతో పాము పొట్ట భాగంలో గట్టిగా ఏదో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఆ పాముని ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ మూగజీవాల చికిత్స విభాగానికి తరలించారు. అక్కడ పాముకి ఎక్స్‌–రే తీసి చూడగా పాము పొట్టలో సీసా మూత ఉన్నట్లు నిర్ధారించారు డాక్టర్లు.

Also read : Telangana assembly : అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన డిప్యూటీ స్పీకర్

అనంతరం మూగజీవాల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ ఇంద్రమణి నాథ్, రేడియాలజీ నిపుణులు డాక్టర్‌ సిద్ధార్థ్‌ శంకర బెహరా ఆ పాముకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి, సీసా మూతను తొలగించారు. ప్రస్తుతం పాము పరిస్థితి బాగానే ఉంది. దాన్ని మరో వారం రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలని తెలిపారు డాక్టర్లు.

ట్రెండింగ్ వార్తలు