World Bicycle Day: అగ్గిపుల్లలతో సైకిల్ తయారు చేసిన 18 ఏళ్ల యువకుడు

జూన్ మూడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరికి చెందిన సాస్వత్ రంజన్ సాహూ అనే 18 ఏళ్ల కుర్రాడు అగ్గిపుల్లలతో సైకిల్ తయారు చేసిన ఔరా అనిపించాడు.

World Bicycle Day..Bicycle making with match sticks : జూన్ 3. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా 18 ఏళ్ల కుర్రాడు వినూత్నంగా సైకిల్ తయారు చేశారు. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం..పెట్రోల్ ఆదా కూడా అవుతుంది. కొద్దిపాటి దూరాలకు కూడా నడవటం మానేశాం. కనీసం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లటం కూడా మానేశాం. ఫలితంగా ఎన్నో అనారోగ్యాలు. పైగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది.ఇదిలా ఉంటే..జూన్ మూడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరికి చెందిన సాస్వత్ రంజన్ సాహూ అనే 18 ఏళ్ల కుర్రాడు అగ్గిపుల్లలతో సైకిల్ తయారు చేసిన ఔరా అనిపించాడు. ఈ వినూత్న సైకిల్ ను తయారు చేసిన సందర్భంగా సాస్వత్ రంజన్ మాట్లాడుతూ..అగ్గిపుల్లలతో సైకిల్ తయారు చేయటానికి నాకు ఏడు రోజులు పట్టిందని తెలిపారు. ఈ సైకిల్ తయారీ కోసం 3,653 అగ్గిపెట్టెలను ఉపయోగించానని తెలిపాడు.

ఈ matchsticks సైకిల్ 50 అంగుళాల పొడవు..25 అంగుళాల వెడల్పు గల సైకిల్ తయారీకి 3,653 అగ్గిపెట్టెల్లోని పుల్లలను ఉపయోగించానని చెప్పాడు. చాలా క్యూట్ లుక్ లో ఆకట్టుకుంటున్న ఈ వినూత్న సైకిల్ 1870 నుంచి 1880 కాలంనాటి సైకిల్ మోడల్ లో ఉంది. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ మోడల్ సైకిల్ చూశానని అది నాకు చాలా బాగా నచ్చిందని అందుకే ఈనాటి సైకిల్ మోడల్ తోనే అగ్గిపుల్లలతో తయారు చేయాలనిపించిందని తెలిపారు. పర్యావరణానికి జరిగే హాని తగ్గించాలంటే ప్రతీ ఒక్కరూ సైకిల్ ను ఉపయోగించాలని సూచించాడు.

ట్రెండింగ్ వార్తలు