Odisha Train Accident: రైలు ప్రమాదం నుంచి బయటపడి సొంత ప్రాంతానికి తెలుగు యువకులు.. ఏం చెప్పారంటే..?

" నా కళ్ల ముందు వందల మంది చనిపోయారు " అని శ్రీకర్ బాబు అనే విద్యార్థి చెప్పారు.

Odisha Train Accident – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నుండి బయటపడి సొంత ప్రాంతానికి చేరుకున్నారు. ఏలూరుకు చెందిన శ్రీకర్ బాబు అనే విద్యార్థి సొంత ప్రాంతానికి చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో శ్రీకర్ బాబుని చూసి ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీకర్ బాబు 10టీవీతో మాట్లాడుతూ… “ప్రమాదం నుండి బయటపడటం సంతోషంగా ఉంది. ప్రమాదం జరిగిన పరిస్థితులు చూస్తే భయాందోళనకు గురయ్యాను. నా కళ్ల ముందు వందల మంది చనిపోయారు. కోల్ కతా యూనివర్సిటీలో చదువుతూ సెలవుల్లో నా స్నేహితులతో కలిసి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాను.

బాలాసోర్ వచ్చేసరికి పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టుకున్నాయి. నేను ప్రయాణించే భోగి కూడా పక్కకు ఒరిగిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెంటనే అంబులెన్సులు చేరుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భోగీలు చెల్లాచెదురుగా పడి ఉండటానికి గమనించి షాక్ అయ్యాను. ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడటం అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పారు.

రైలు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన రంజిత్ అలీ వ్యక్తి తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

మరికొందరి స్పందన…

ట్రెండింగ్ వార్తలు