Odisha Train Accident: రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని అసత్యాలు చెప్పి పరిహారాన్ని…

ఆమె భర్త బతికే ఉన్నాడు. తన భార్య చేసిన పనికి కంగుతిన్నాడు.

Odisha Train Accident – ex gratia: ఒడిశా, బాలాసోర్ (Balasore) లో జరిగిన రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇస్తుండడంతో అత్యాశకు పోయింది ఓ మహిళ. తన భర్త ఆ ప్రమాదంలో మృతి చెందాడని అసత్యాలు చెప్పి, అందుకు ధ్రువీకరణ పత్రాలు కూడా తీసుకుని పరిహారానికి దరఖాస్తు చేసుకుంది.

ఆమె భర్త బతికే ఉన్నాడు. తన భార్య చేసిన పనికి కంగుతిన్నాడు. తాను చనిపోలేదని చెబుతూ అధికారులకు అతడు స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కటక్ జిల్లాలో (Cuttack) ఈ ఘటన చోటుచేసుకుంది. మానియాబంధ పోలీసు స్టేషన్ కు విజయ్ దత్ అనే వ్యక్తి వచ్చి తన భార్య నిర్వాకం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విజయ్ భార్య పేరు గీతాంజలి దత్తా. ఇటీవల ఆమె ఆసుపత్రికి వెళ్లి, బాలాసోర్ రైలు ప్రమాద మృతదేహాలను చూసింది. ఓ నకిలీ ఆధార్ కార్డును అధికారులకు చూపింది. తన భర్త రైలు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పింది. అయితే, దీనిపై పోలీసులు జరిపిన విచారణలో గీతాంజలి అసత్యాలు చెప్పిందని వెల్లడైంది.

దీనిపై ఆమె భర్త కూడా తాజాగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన భార్య చేసిన పని పట్ల సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇటువంటి మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన అనడం గమనార్హం. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశాడు. రైలు ప్రమాదంలో మొత్తం 288 మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరి కుటుంబాలకు పరిహారం అందుతోంది.

Odisha Train Accident: విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామా కోరుతుంటే శభాష్ అంటూ సపోర్ట్ చేసిన మాజీ ప్రధాని

ట్రెండింగ్ వార్తలు