Avocados For Puja : దేవుడికి నైవేద్యంగా అవకాడోలు.. పూజ కూడా అప్‌గ్రేడ్ అయిందిగా.. అరటి పండ్ల స్థానంలో విదేశీ పండు..!

బెంగళూరుకు చెందిన ఓ ఫ్యామిలీ అసలైన పండ్లకు బదులుగా అన్యదేశ పండ్లతో పూజలో దేవుడికి సమర్పించింది. అరటిపండ్ల స్థానంలో దేవతలకు అవకాడోలను సమర్పించారు. సోషల్ మీడియాలో ఫొటో వైరల్ అవుతుంది.

Bengaluru Man On Parents Using Avocados For Puja ( Image Source : Twitter)

Avocados For Puja : ఒకప్పటిలా ఉండటం లేదు.. అన్ని మారిపోతున్నాయి. ఆచార సాంప్రదాయాలు, మతపరమైనవి ఇలా ఎన్నో మారిపోతున్నాయి. దేవుడి పూజ అనగానే అందరికి ప్రధానంగా గుర్తొచ్చేది అరటిపండు.. మనలో చాలా మందికి, డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లు, ఆపిల్స్ ఎల్లప్పుడూ హిందూ పూజా నైవేద్యాలలో భాగంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. దానికి తగ్గట్టుగా దేవుడి నైవేద్యంగా సమర్పించేవి కూడా అప్‌గ్రేడ్ అయిపోతున్నాయి.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

బెంగళూరుకు చెందిన ఓ ఫ్యామిలీ అసలైన పండ్లకు బదులుగా అన్యదేశ పండ్లతో పూజలో దేవుడికి సమర్పించింది. దీనికి సంబంధించి ఫొటోను ట్విట్టర్ (X) యూజర్ ధర్మేష్ బా తన ఫ్యామిలీ అరటిపండ్ల స్థానంలో దేవతలకు అవకాడోలను సమర్పించినట్లు షేర్ చేశారు. పూజ కోసం అవకాడో పండును ఎంచుకోవడంపై సోషల్ మీడియా వినియోగదారులు అవాక్కయ్యారు.

పూజకు విదేశీ పండు సముచితమా? :
కొందరు ఈ పోస్ట్‌ను చూడగానే ఫన్నీగా భావించగా, మరికొందరు మతపరమైన ఆచారాల కోసం విదేశీ పండును ఉపయోగించడం సముచితమా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ, బెంగళూరు ఫ్యామిలీ ఈ విషయంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు. “తల్లిదండ్రులు పట్టణంలో ఉన్నారు. దేవునికి వారు సమర్పించే అర్పణలు అరటిపండ్ల నుంచి అవకాడోలకు అప్‌గ్రేడ్ అయ్యాయి” అని బా అన్యదేశ పండ్ల ఫొటోను మైక్రో-బ్లాగింగ్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకూ 5,500 కన్నా ఎక్కువ వ్యూస్, అనేక లైక్‌లు వచ్చాయి.

మిడిల్ క్లాసు కాదు.. అవకాడో క్లాస్ :
పోస్టుపై స్పందించిన నెటిజన్లలో ఒకరు “అవి ఏమిటి.. మిలీనియల్స్?” అని కామెంట్ చేయగా.. “మేము మిలీనియల్స్” అని సమాధానం ఇచ్చింది. “తక్కువ పిండి పదార్థాలు దేవుడా!” మరో యూజర్ వ్యాఖ్యానించారు. అభిరుచులు పరిణామం చెందినట్టే సమర్పణలు కూడా పెరుగుతాయని మరో యూజర్ కామెంట్ పెట్టారు.

“ఇకపై మిడిల్ క్లాస్ కాదు.. అవకాడో క్లాస్” అని మరో యూజర్ స్పందించాడు. “ఈ విదేశీయుడిలా దేవుళ్ళు లేరు.. దయచేసి బనానాస్‌కి మారండి” అని మరొకరు కామెంట్ పెట్టారు. “అది అగర్బత్తీలతో గుచ్చితే తట్టుకోగలదా? అరటిపండుకు కత్తిపోటు నుంచి కొంత విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది” అని మరో యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు.

Read Also : Viral Video : సాహసం చేయరా డింభకా.. వణుకుపుట్టించే వీడియో.. ఎంపైర్ స్టేట్ యాంటీనాపైకి ఎక్కి నిలబడి సెల్ఫీ స్టంట్..!

ట్రెండింగ్ వార్తలు