జనవరి30న ఆల్ పార్టీ మీటింగ్…31 నుంచి బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. జనవరి 31న రాజ్యసభ ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఫిబ్రవరి 1న తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పియూష్ గోయల్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు. అనారోగ్య సమస్యలతో అమెరికాలో ఆర్థికమంత్రి ట్రీట్మెంట్ పొందుతున్నారు. దీంతో ఆ శాఖ బాధ్యతలను తాత్కాలికంగా పియూష్ గోయల్ నిర్వహిస్తున్నారు.