Omicron Transmission: కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశలో ఒమిక్రాన్.. పెరుగుతున్న ప్రమాదం!

దేశంలో కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Omicron Transmission: దేశంలో కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. COVID-19 Omicron వేరియంట్ దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరుకుందని INSACOG తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది. మెట్రోలలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రభావవంతంగా మారింది.

అనేక ముఖ్యమైన నగరాల్లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ సంకేతాలతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అవగా.. సాధారణ ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఒమిక్రాన్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరుకోవడంపై INSACOG అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన చేసింది.

SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం -INSACOG.. వైరస్ ఎలా వ్యాపిస్తుంది.. ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేదానిపై  దేశవ్యాప్తంగా అధ్యయనాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ కోవిడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా BA.2 అనేది Omicron వేరియంట్ సబ్-వేరియంట్ అని, ఇది కూడా భారతదేశంలో కనుగొన్నట్లుగా చెబుతోంది.

ఒమిక్రాన్ కేసుల్లో చాలావరకు లక్షణాలు కనిపించట్లేదని, కూడా అధ్య‌య‌నం చెబుతోంది. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. 2021 నవంబర్ 25 – డిసెంబర్ 23 మధ్య అన్ని RT-PCR శ్వాసకోశ నమూనాల్లో పాజిటివ్ వచ్చినవారు ఎక్కువమందిలో లక్షణాలు కనిపించలేదని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

దేశంలో గత 24 గంటల్లో మూడు లక్షల 33 వేల 533 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఇదే సమయంలో 525 మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17 శాతానికి దగ్గరగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు