Omicron India : ఒమిక్రాన్ ఉధృతి, మహారాష్ట్రలో ఆంక్షలు..నూతన మార్గదర్శకాలు

ఇండియాలోనూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

Omicron Variant In India : ఇండియాలోనూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విరుచుకుపడుతోంది. కొత్తగా 30 కేసులు నమోదు కావడంతో… దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 145కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 48 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ 22, రాజస్థాన్ 17, కర్ణాటక 14, తెలంగాణ 20, గుజరాత్ 7, కేరళలో 11, ఉత్తర్ ప్రదేశ్ 2, చండీఘడ్ 1, తమిళనాడు 1. పశ్చిమబెంగాల్ 1, ఏపీలో 1 రికార్డయ్యాయి.

Read More : Warangal : భద్రకాళి ఆలయానికి జస్టిస్ ఎన్వీ రమణ

మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రద్దీని నివారించాలని సాధారణ ప్రజలను కోరింది. కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కరోనా నిబంధనలను ఉల్లఘించే వారిపై చర్యలు తీసుకోవడానికి వార్డు స్థాయిలో స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Read More : Petrol Price India : వాహనదారులకు గుడ్ న్యూస్, పెట్రోల్ ధరల్లో నో ఛేంజ్..వివరాలు

వివాహాలు, ఇతర వేడుకల సమయంలో మార్గదర్శకాలను పాటించడం అందరికీ తప్పనిసరి అని పేర్కొంది. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కచ్చితంగా పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని అధికారులు సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు షాపింగ్ మాల్‌లలో వాటి సామర్థ్యంలో 50 శాతం మాత్రమే జనాలను అనుమతించాలని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు