On 37th Anniversary Of Operation Blue Star Posters Of Bhindranwale Khalistani Flags Seen At Golden Temple
Operation Blue Star Anniversary “ఆపరేషన్ బ్లూ స్టార్”కి 37 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం అమృత్‌సర్ లోని గోల్డెన్ టెంపుల్‌లో మరోసారి ఖలిస్తానీ జెండాలు కనిపించాయి. వందలాది మంది గోల్డెన్ టెంపుల్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరై ఖలిస్తానీ జెండాలతో నినాదాలు చేశారు. అంతేకాకుండా ఖలిస్తాన్ వేర్పాటువాది జర్నైల్ భింద్రన్‌వాలే పోస్టర్లు కూడా గోల్డెన్ టెంపుల్‌లో కనిపించాయి. ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో అతనితోపాటు అనుచరులను కూడా ఇండియన్ ఆర్మీ కాల్చి చంపిన విషయం తెలిసిందే.
కాగా,”ఆపరేషన్ బ్లూ స్టార్”37 యానివర్శరీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా,ముఖ్యంగా అమృత్ సర్ లో భద్రతను కట్టుదిట్టం చేసింది పంజాబ్ ప్రభుత్వం. ఎలాంటి అవాంఛీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్తగా అమృత్ సర్ లో 6వేల మందికి పైగా పోలీసులును రంగంలోకి దింపినట్లు అమృత్ సర్ పోలీస్ కమిషనరేట్ తెలిపింది. మరోవైపు,ఆపరేషన్ బ్లూ స్టార్”37 యానివర్శరీ సందర్భంగా ఇవాళ వివిధ ప్రోగ్రాంలు నిర్వహించాలని సిక్కు ఆర్గనేజేషన్స్ ఫ్లాన్ చేశాయి. అమృత్ సర్ లోని అకాల్ తక్త్ కాంప్లెక్స్ వద్ద భారీ సెక్యూరిటీ నడుమ…జూన్-6ను ఖలిస్తాన్ డే గా ప్రకటించాలి డిమాండ్ చేస్తూ ఖలిస్తానీ అనుకూల గ్రూప్ దల్ ఖల్సా గోల్డెన్ టెంపుల్ వరకు మార్చ్ నిర్వహించింది. మరోవైపు,ఎర్రకోట హింస ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉండి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న నటుడు మరియు సింగర్ దీప్ సిద్దూ కూడా ఆదివారం గోల్డెన్ టెంపులో ప్రార్థనలు నిర్వహించారు.
కాగా, 1984, జూన్ 1 నుంచి 10 మధ్య ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం డిమాండ్ చేస్తూ గోల్డెన్ టెంపుల్‌లో తలదాచుకున్న జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే సహా ఇతర సిక్కు మిలిటెంట్లను ఏరివేయాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆర్మీని ఆదేశించారు. దానికే ఆపరేషన్ బ్లూస్టార్ అనే పేరు పెట్టారు.