Supreme Court: వాయు కాలుష్యంపై సుప్రీం ఆగ్రహం.. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి

ప్రతీఏటా శాతాకాలంలో దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది.

Supreme

Supreme Court: ప్రతీఏటా శాతాకాలంలో దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. కాలుష్యం ప్రభావంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. చిన్న పిల్లలు, ముసలి వారు, గర్భిణులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఢిల్లీలో పెరిగిపోయిన వాహనాల పొగ కాలుష్యానికి కారణం అవుతోంది.

ఢిల్లీలో రోజురోజుకు క్షీణిస్తున్న కాలుష్యంపై సెలవు దినమైనా కూడా శనివారం ఢిల్లీ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ వాదనలను విన్న సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం. కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవలసిన చర్యలను ఎందుకు తీసుకోవట్లేదంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో విచారణ

కాలుష్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండటం పట్ల ఆందోళన, విచారం వ్యక్తం చేసింది ధర్మాసనం. కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనబెట్టి కాలుష్య నియంత్రణ అంశంపై దృష్టి సారించాలని కోరారు ప్రధాన న్యాయమూర్తి.

తక్షణం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు జస్టిస్ ఎన్వీ రమణ. కాలుష్య నివారణకు తగ్గింపుకు తక్షణం చర్యలు చేపట్టాలని అవసరమైతే రెండు రోజుల పాటు ఢిల్లీలో లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కోరింది సుప్రీంకోర్టు.

NBK 107 : బాలయ్య యాక్షన్ మొదలైంది