Fire Accident : ఢిల్లీలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

మొదట్లో కొన్ని టైర్లకు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత మంటలు సమీపంలోని గుడిసెలను చుట్టుముట్టాయని ప్రాథమిక సమాచారమని అధికారి తెలిపారు.

fire accident

Delhi Fire Accident : ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వృద్ధుడికి 30 శాతం కాలిన గాయాలయ్యాయి. మూడు గుడిసెలు కాలిపోయాయి.

మంటలు చెలరేగినట్లు రాత్రి 8 గంటల ప్రాంతంలో షకర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పీసీఆర్ కాల్ వచ్చిందని, ఆ తర్వాత అగ్నిమాపక శాఖ అప్రమత్తమైందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మొదట్లో కొన్ని టైర్లకు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత మంటలు సమీపంలోని గుడిసెలను చుట్టుముట్టాయని ప్రాథమిక సమాచారమని అధికారి తెలిపారు.

Leopard : చిరుతపులి దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి

గుడిసెలో నిద్రిస్తున్న నాథు లాల్ (62)కు 30 శాతం కాలిన గాయాలయ్యాని, అతన్ని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పిన తర్వాత ఒక గుడిసెలో నుండి కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించినట్లు అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.