Galwan Incident
Galwan Incident: లడఖ్ లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగి నేటికీ ఏడాది పూర్తైంది. 2020 జూన్ 15 రెండు దేశాల సైనికులు మధ్య భౌతిక దాడులకు పాల్పడ్డారు. ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద ఈ ఘర్షణలు జరిగాయి. అయితే మే నెలలోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తోపులాటలు జరిగాయి, దీంతో ఇరు దేశాలు ఆ ప్రాంతాల్లో సైనికుల సంఖ్యను పెంచాయి.
ఇదే సమయంలో భారత బలగాలు తమ భూభాగంలోకి వస్తున్నాయంటూ చైనా విదేశాంగ మంత్రి ఆరోపణలు చేశాడు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కూడా స్పందించారు. భారత్ బలగాలు గస్తీ కాస్తున్న సమయంలో చైనా సైన్యం అడ్డుపడుతోందని తెలిపాడు. అయితే భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెద్దదయ్యే అవకాశం ఉండటంతో ఇరు దేశాల ఉన్నతాధికారులు జూన్ 6, 2020న సమావేశమయ్యారు. చర్చలతోనే సమస్య పరిష్కారమవుతుందని ఇరు దేశాల అధికారులు మాట్లాడుకున్నారు.
అనంతరం పలు దఫాలు చర్చలు జరిపారు. ఇక ఈ చర్చలు జరుగుతున్న సమయంలో ప్యాంగ్యాంగ్ సరస్సులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిరాయుధులైన ఉన్న భారత సైన్యంపై ఒక్కసారిగా దాడి చేశారు చైనా సైనికులు.. రాడ్లు, కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వీరిలో కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నాడు. ఇక ఇదే సమయంలో చైనా సైనికులపై భారత సైనికులు విరుచుకుడ్డారు.
దీంతో చైనా వైపు భారీగా ప్రాణనష్టం జరిగింది. 45 మంది వరకు చైనా సైనికులు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఘటన విషయం తెలియడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరుదేశాల మేజర్ స్థాయి చర్చలు జరిపారు. ఆ తర్వాత యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ చైనా మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని చాలామంది భావించారు. కానీ చర్చలతోనే సమస్య పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు భావించాయి. ఈ మేరకు చర్చలు ప్రారంభించి కొనసాగిస్తున్నాయి.