ఆన్ లైన్ నిఖా.. వీడియో కాన్ఫిరెన్స్‌లో పట్నా జంటకు పెళ్లి

  • Publish Date - March 24, 2020 / 03:12 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా నియంత్రించేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే బీహార్ లోనూ లాక్ డౌన్ విధించారు. బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. గుంపులుగా బయట తిరిగేందుకు అనుమతించడం లేదు.

పెళ్లిళ్లు వంటి శుభకార్యలకు అనుమతి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ లోని పట్నాకు చెందిన జంట… ఆన్ లైన్లో పెళ్లి చేసుకున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ల మధ్య వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వివాహం చేసుకున్నారు.

ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో అతిథుల మధ్య జరుపుకోవాల్సిన వివాహం ఆన్ లైన్లో చేసుకోవాల్సి వచ్చింది.ప్రస్తుత టెక్నాలజీ సాయంతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా Nikah జరిపించాలని వధువరుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

సోషల్ మీడియా ద్వారా నిఖా వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఆన్ లైన్ వీడియోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి వేడుక అనంతరం యువ జంట కుటుంబ సభ్యులు ఒకరినొకరు అభినందించుకోవడం చూడొచ్చు.

బీహార్ లో ఇప్పటివరకూ మూడు కరోనా కేసులు నమోదు కాగా, అందులో ఒకరు మృతిచెందినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.