ఇకపై క్రెడిట్, డెబిట్ కార్డుల్లో ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసులు పనిచేయవు.. ఎందుకంటే?

  • Publish Date - October 3, 2020 / 05:42 PM IST

Online payment services : క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? డిజిటల్ పేమెంట్స్ కోసం కార్డు పెద్దగా వాడటం లేదా? అయితే మీ క్రెడిట్, డెబిట్ కార్డుల ఆన్ లైన్ పేమెంట్ సర్వీసులు డిజేబుల్ అయిపోయినట్టే.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల్లో ఆన్ లైన్ పేమెంట్ సర్వీసులు పనిచేయవు.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. డెబిట్, క్రెడిట్ కార్డులను మరింత సెక్యూర్ చేసేందుకు RBI ఈ కొత్త గైడ్ లైన్స్ ప్రవేశపెట్టింది.



అక్టోబర్ 1 నుంచే అమల్లోకి :
ఈ ఏడాది 2020 అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ఇకపై బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు జారీ చేసే అన్ని కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులపై కేవలం డొమెస్టిక్ ట్రాన్సాక్షన్లు మాత్రమే చేసుకోగలరు. అది కూడా ATMలు, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ వద్ద మాత్రమే యాక్సస్ చేసుకోగలరు.

ఇదంతా బ్యాంకులు, కార్డుదారుల డిజిటల్ పేమెంట్స్ సెక్యూర్‌గా ఉండేందుకు ఈ నిబంధనలు RBI అమల్లోకి తీసుకొచ్చిందని ఐటీ నిపుణులు అంటున్నారు. ఆన్ లైన్ మోసాలను అరికట్టడమే కాకుండా ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్స్ కు మరింత భద్రత కల్పించడమే ఉద్దేశమని పేర్కొన్నారు.



ఇప్పటికే ఆర్బీఐ అన్ని బ్యాంకులు, ఇతర కార్డు జారీ సంస్థలకు అన్ని తమ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆన్ లైన్ పేమెంట్ సర్వీసులను డిజేబుల్ చేయాలని సూచించింది. ఇండియాతో పాటు అంతర్జాతీయంగా రెండింటిలోనూ ఇప్పటికీ ఆన్ లైన్ లేదా కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లను చేయని కార్డుల్లో ఈ సర్వీసులను డిజేబుల్ చేయాలని సూచించింది. ఒకవేళ కార్డుదారులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఇండియా బయటి అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లు చేయాలనుకుంటే మాత్రం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది.



అన్ని బ్యాంకులకు ఇదే రూల్ :
ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. కార్డుదారులు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లతో పాటు కాంటాక్ట్ లెస్ కార్డ్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఈ రిజిస్టర్ ప్రిఫరెన్సీస్ (opt-in or opt-out services, spend limits) సర్వీసులను వినియోగించుకోగలరు. ఏదైనా కార్డు జారీ చేసే సమయంలో (physical and virtual) అన్ని కార్డులపై కాంటాక్ట్ ఆధారిత పాయింట్లలో మాత్రమే కార్డులు యాక్సస్ చేసుకునేలా ఉండాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది.

అది కూడా ఇండియాలోనే యాక్సస్ చేసుకోనేలా ఉండాలి. అందుకే అన్ని బ్యాంకులు తమ క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు domestic transactions (ATMs, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టర్మినల్స్ వద్ద) మాత్రమే చేసుకునేలా కార్డులను జారీచేస్తున్నాయి.



NFC ఎనేబుల్ చేస్తే.. PIN లేకుండానే రూ.2 వేలు :
ఈ కొత్త నిబంధన ప్రకారం.. డెబిట్, క్రెడిట్ కార్డుదారులు NFC (contactless) సౌకర్యాన్ని Enable లేదా Disable చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ సౌకర్యం ద్వారా కార్డుదారులు తమ కార్డు స్వైప్ చేయకుండా PIN నెంబర్ ఎంటర్ చేయకుండానే రోజుకు రూ.2,000 limit వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు..



కావాలనుకుంటే.. సెక్యూరిటీ కోసం ట్రాన్సాక్షన్లపై లిమిట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుదారుల్లో ఎవరైనా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లను సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.