విక్రమ్ ల్యాండర్‌పై నాసా చేసిన ప్రకటనను ఇస్రో ఖండించింది. గతంలోనే తాము గుర్తించామని కౌంటర్ ఇచ్చింది. విక్రమ్ శకలాలను గుర్తించామని నాసా చేసిన ప్రకటనను చీఫ్ శివన్ ఖండించారు. భారత ఆర్బిటర్ గతంలోనే విక్రమ్ ల్యాండర్ ప్రదేశంతో పాటు..దాని శకలాలను గుర్తించామని నాసా ప్రకటనతో ఆయన స్పందించారు. ఈ విషయాన్ని వెబ్ సైట్‌ద్వారా ప్రపంచానికి తెలియచేయడం జరిగిందన్నారు.
విక్రమ్ ల్యాండర్ ముక్కలుగా పడి ఉన్నట్లు నాసా వెల్లడించిన 24 గంటల వ్యవధిలోనే శివన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద దిగే మసయంలో క్రాష్ ల్యాండింగ్‌కు గురైందని చెన్నైకి చెందిన ఇంజినీర్ నిర్ధారించారు. దీనికి సంబంధించిన శకలాలు ఫలానా చోట ఉన్నట్లు గుర్తిస్తూ..నాసాకు లేఖ రాశారు. దీనిని నాసా ధృవీకరిస్తూ..తామే మొదటగా విక్రమ్ ల్యాండర్ శకలాలు గుర్తించినట్లు..ప్రకటించారు నాసా సైంటిస్టులు.
> విక్రమ్ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 కిలోమీటర్ల దూరంలో శాస్త్రవేత్త షణ్ముగం గుర్తించారని, అనంతరం ఎల్ఆర్‌వో ప్రాజెక్టు బృందం ఇతర శకలాలను గుర్తించిందని వెల్లడించింది.
> 2019, సెప్టెంబర్ 07వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగుతూ..చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో భూ కేంద్రంతో సంబంధాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
> విక్రమ్ చివరి క్షణంలో జరిగిన పరిణామాలపై కారణాలను ఇస్రో ఇప్పటికే విశ్లేషించింది.
> సాఫ్ట్ వేర్ సమస్య వల్లే..ల్యాండింగ్‌లో లోపం తలెత్తిందని గుర్తించారు.
Read More : ఐఎన్ఎక్స్ మీడియా కేసు : చిదంబరంకు బెయిల్ వచ్చేనా