PM Modi: మన ఎదుగుదల చూసి ఓర్వలేక కులాన్ని మతాన్ని ఎగదోస్తున్నారు.. మోదీ ఫైర్

పటేల్ స్ఫూర్తిని దేశం తీసుకోవాలని మోదీ సూచించారు. ఆయన 550 సంస్థానాల్ని కలిసి దేశాన్ని ఏకం చేశారని, మనం కూడా దేశ ఐక్యతకు పాటు పడాలని కోరారు. ఇక మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై మోదీ విచారం వ్యక్తం చేశారు. తాను ఏక్తా నగర్‭లో నిలబడి మాట్లాడుతున్నప్పటికీ, తన మనసు మాత్రం మోర్బీలోనే ఉందని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ మోదీ కోరారు.

PM Modi: మన దేశం అభివృద్ధిలో ఉరుకులు పెడుతోంటే శత్రువులకు చాతిలో నొప్పి పుడుతోందని, అందుకే కులం, మతం పేరుతో దేశాన్ని చీల్చాలని ప్రయత్నిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‭లోని కేవాడియాలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

‘‘దేశం అభివృద్ధి చెందుతోంది. అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. ఇది చూసి శత్రువుల చాతిలో నొప్పి పుడుతోంది. అందుకే కులం, మతం, జాతి, ప్రాంతం అంటూ దేశంలో వైశమ్యాలు రెచ్చగొట్టి దేశాన్ని విడదీయాలని చూస్తున్నారు. మన శత్రువులు అంటే అందరూ దేశం బయటే లేరు. కొందరు దేశంలో లోపల కూడా ఉన్నారు’’ అని ప్రధాని మోదీ అన్నారు.

పటేల్ స్ఫూర్తిని దేశం తీసుకోవాలని మోదీ సూచించారు. ఆయన 550 సంస్థానాల్ని కలిసి దేశాన్ని ఏకం చేశారని, మనం కూడా దేశ ఐక్యతకు పాటు పడాలని కోరారు. ఇక మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై మోదీ విచారం వ్యక్తం చేశారు. తాను ఏక్తా నగర్‭లో నిలబడి మాట్లాడుతున్నప్పటికీ, తన మనసు మాత్రం మోర్బీలోనే ఉందని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ మోదీ కోరారు.

Vladimir Putin: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించిన పుతిన్, నేపాల్ ప్రధాని… మృతుల కుటుంబాలకు సంతాపం

ట్రెండింగ్ వార్తలు