Vladimir Putin: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించిన పుతిన్, నేపాల్ ప్రధాని… మృతుల కుటుంబాలకు సంతాపం

గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Vladimir Putin: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించిన పుతిన్, నేపాల్ ప్రధాని… మృతుల కుటుంబాలకు సంతాపం

Updated On : October 31, 2022 / 5:19 PM IST

Vladimir Putin: గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలి 140 మంది మరణించిన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోపాటు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు స్పందించారు. ఘటనలో మృతుల కుటుంబాలకు పుతిన్ సంతాపం తెలిపారు.

PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని

ఈ మేరకు సోమవారం పుతిన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రియమైన రాష్ట్రపతి, ప్రధాని.. గుజరాత్, కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై నా సంతాపం ప్రకటిస్తున్నాను’’ అంటూ పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు, ప్రధాని మోదీలకు తన సంతాప సందేశాన్ని అందించారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని పుతిన్ ఆకాంక్షించారు. మరోవైపు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా కూడా స్పందించారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించారు.

Elon Musk: ట్విట్టర్ బ్లూటిక్‌కు డబ్బులు కట్టాల్సిందేనా.. నెలకు ఎంతంటే!

‘‘గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయంలో భారత ప్రజలకు నా సానుభూతి తెలుపుతున్నా. మృతుల కుటుంబాలకు ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ షేర్ బహదూర్ ట్వీట్ చేశారు. వీరితోపాటు ఇండియాలో బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎల్లిస్, సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్ తదితరులు ఘటనపై తమ సంతాపాన్ని ప్రకటించారు.