PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని

గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ మంగళవారం పరిశీలిస్తారు. ఈ మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతోపాటు, బాధిత కుటుంబాల్ని కూడా మోదీ పరామర్శిస్తారు.

PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని

PM Modi: గుజరాత్, మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 140 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించబోతున్నారు. మంగళవారం ఆయన మోర్బిలో కేబుల్ బ్రిడ్జి కూలిన స్థలాన్ని పరిశీలిస్తారు.

Bharat Jodo Yatra: టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోం.. ఎందుకంటే..?: రాహుల్ గాంధీ

గుజరాత్ మోదీ సొంత రాష్ట్రం అనే సంగతి తెలిసిందే. ఇక ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు కూడా ప్రధాని గుజరాత్‌లోని వడోదరలోనే ఉన్నారు. అక్కడ ఆదివారం ఉదయం టాటా-ఎయిర్ బస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మోదీ, మంగళవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించబోతున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. బాధిత కుటుంబాలను మోదీ పరామర్శిస్తారు. ఈ ఘటన మోదీని ఎంతో కలచివేసినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దీనివల్లే ఆయన సోమవారం పార్టీ కార్యకర్తలతో జరగాల్సిన సమావేశాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. అలాగే రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు.

Gujarat Bridge Collapse: మోర్బీలో తీగల వంతెన ఎలా కూలిపోయింది.. ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..

ప్రస్తుత విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, గుజరాత్ ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని, సహాయక చర్యలు కొనసాగుతాయని ప్రధాని మోదీ సోమవారం ప్రకటించారు. మోర్బి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన విషాదాన్ని నింపింది. దాదాపు 140 మందికిపైగా మరణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.