Bharat Jodo Yatra: టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోం.. ఎందుకంటే..?: రాహుల్ గాంధీ

తెలంగాణలో టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మారూప్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవినీతికి పాల్పడేవారితో కలిసి తాము వెళ్లలేమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరికాగానే పోరాడుతుందని అన్నారు. టీఆర్ఎస్ తో పొత్తులు వద్దని కాంగ్రెస్ తెలంగాణ నేతలే చెబుతున్నారని అన్నారు. వారి అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Bharat Jodo Yatra: టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోం.. ఎందుకంటే..?: రాహుల్ గాంధీ

Both the people have position says Rahul Gandhi on party presidential polls

Bharat Jodo Yatra: తెలంగాణలో టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మారూప్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవినీతికి పాల్పడేవారితో కలిసి తాము వెళ్లలేమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరికాగానే పోరాడుతుందని అన్నారు. టీఆర్ఎస్ తో పొత్తులు వద్దని కాంగ్రెస్ తెలంగాణ నేతలే చెబుతున్నారని అన్నారు. వారి అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కేసీఆర్ కు ఇష్టం ఉంటే అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని రాహుల్ తెలిపారు. టీఆర్ఎస్ విధానాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. కేసీఆర్ తో నితీశ్ మాట్లాడితే మాట్లాడుకోవచ్చని తెలిపారు. దానితో తమకు సంబంధం లేదని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు అంత డబ్బు ఎలా వస్తుందని నిలదీశారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమని అన్నారు. 2024లో విభజన శక్తులు సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఎన్నికలు ఉంటాయని చెప్పారు. బీజేపీపై యుద్ధం 2 నిమిషాల్లో ముగిసేది కాదని, దేశ ప్రజలను భారత్ జోడో యాత్ర ద్వారా చైతన్యపరుస్తున్నామని చెప్పుకొచ్చారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..