Elon Musk: ట్విట్టర్ బ్లూటిక్‌కు డబ్బులు కట్టాల్సిందేనా.. నెలకు ఎంతంటే!

ట్విట్టర్ బ్లూటిక్ యూజర్లకు షాకివ్వబోతుంది ట్విట్టర్. ఇకపై ప్రొఫైల్‌లో బ్లూటిక్ ఉండాలంటే తప్పనిసరిగా బ్లూ మెంబర్‌షిప్ తీసుకోవాల్సిందే. దీనికి నెలనెలా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Elon Musk: ట్విట్టర్ బ్లూటిక్‌కు డబ్బులు కట్టాల్సిందేనా.. నెలకు ఎంతంటే!

Elon Musk: ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ సంస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను తొలగించిన మస్క్.. ఇప్పుడు యూజర్లపై కూడా దృష్టిపెట్టారు.

PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని

త్వరలో బ్లూటిక్ యూజర్లు తమ బ్లూటిక్ కోసం నెలనెలా డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు. అంటే ఇకపై బ్లూ మెంబర్స్‌కు మాత్రమే ట్విట్టర్ బ్లూటిక్ అందుబాటులో ఉంటుంది. దీనికోసం కొందరు ఇప్పటికే ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అయితే, ఇకపై బ్లూటిక్ ఉండాలన్నా.. ఎడిట్, అన్‌డూ వంటి ఫీచర్లు వాడుకోవాలన్నా ప్రతి నెలా ఫీజు చెల్లించాల్సిందే. సగటున నెలకు రూ.19.99 డాలర్లను ఫీజుగా నిర్ణయించే అవకాశం ఉంది. అంటే మన కరెన్సీలో నెలకు దాదాపు రూ.1,600 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బ్లూటిక్ కేటాయించే విషయంలో కూడా కంపెనీ మార్పులు చేయబోతుంది. అయితే, ఎలాంటి మార్పులుంటాయి… నిబంధనలేంటి వంటి విషయాల్ని ఇంకా వెల్లడించలేదు. ఫాలోవర్ల సంఖ్యనుబట్టి బ్లూటిక్ కేటాయిస్తారనే ప్రచారంలో నిజం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Britain PM Rishi Sunak : రిషి సునక్ భారతీయుడు కాదు..పాకిస్థానీ అట..! బ్రిటన్ కొత్త ప్రధాని మావాడే అంటూ పాక్‌లో బ్యానర్లు..

బ్లూటిక్ వాడుకోవాలనుకుంటే ఇకపై బ్లూ మెంబర్‌షిప్ తీసుకోవాలి. వీరికి మాత్రమే ఎడిట్, అన్ డూ వంటి ఫీచర్లు పని చేస్తాయి. ప్రస్తుతం బ్లూటిక్ కలిగి ఉన్న యూజర్లు బ్లూ మెంబర్‌షిప్ తీసుకునేందుకు 90 రోజుల గడువు ఉంది. ఆలోపు బ్లూ మెంబర్‌షిప్ తీసుకోకపోతే, బ్లూటిక్ తొలగిస్తారు.