Britain PM Rishi Sunak : రిషి సునక్ భారతీయుడు కాదు..పాకిస్థానీ అట..! బ్రిటన్ కొత్త ప్రధాని మావాడే అంటూ పాక్‌లో బ్యానర్లు..

రిషి సునక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించడం..భారత్‌ను ఆనందడోలికల్లో ఊగించింది. పాలితుడే..పాలకుడుగా ఎదిగాడని యావత్ దేశం సంబరపడింది. అయితే సునక్‌ను బ్రిటన్‌ జాతీయుడుగానే చూడాలని, భారతీయ మూలాలున్నప్పటికీ..ఆయన వల్ల ఇండియాకు ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండబోదన్న విశ్లేషణలూ వెలువడ్డాయి. ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. అసలు రిషి సునక్ భారతీయుడు కాదని, పాకిస్థానీ అని...ఆ దేశ ప్రజలు అంటున్నారు.

Britain PM Rishi Sunak : రిషి సునక్ భారతీయుడు కాదు..పాకిస్థానీ అట..! బ్రిటన్ కొత్త ప్రధాని మావాడే అంటూ పాక్‌లో బ్యానర్లు..

British PM Rishi Sunak origins maybe both Indian and Pakistani (1)

Britain PM Rishi Sunak : రిషి సునక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించడం..భారత్‌ను ఆనందడోలికల్లో ఊగించింది. పాలితుడే..పాలకుడుగా ఎదిగాడని యావత్ దేశం సంబరపడింది. అయితే సునక్‌ను బ్రిటన్‌ జాతీయుడుగానే చూడాలని, భారతీయ మూలాలున్నప్పటికీ..ఆయన వల్ల ఇండియాకు ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండబోదన్న విశ్లేషణలూ వెలువడ్డాయి. ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. అసలు రిషి సునక్ భారతీయుడు కాదని, పాకిస్థానీ అని…ఆ దేశ ప్రజలు అంటున్నారు.

బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన దగ్గరి నుంచి కాబోయే ప్రధానిగా రిషి సునక్ వార్తల్లో నిలిచారు. లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత….బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సునక్ బ్రిటన్ ప్రధాని రేసులో నిలిచిన దగ్గరనుంచి ఆయన విజయం సాధించాలని భారతీయులంతా కోరుకున్నారు. రిషి సునక్ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తర్వాత భారత్ అంతా ఓ భావోద్వేగ వాతావరణం నెలకొంది. పాలితుడే..పాలకుడయిన చరిత్రాత్మక సందర్భం చూసి దేశప్రజలంతా ఆనందంలో మునిగి తేలారు. 200 ఏళ్లపాటు మనదేశాన్ని పరిపాలించిన బ్రిటన్‌కు ఓ భారత సంతతి వ్యక్తి ప్రధాని కావడం… ప్రజాస్వామిక చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భమని…యావత్ ప్రపంచం కొనియాడింది.

అయితే…ఈ సంబరాలపై…రిషిసునక్‌ను మనవాడిగా చెప్పుకోవడంపై దేశంలో విమర్శలూ వినిపించాయి. దశాబ్దాల క్రితం దేశం విడిచి…కెన్యా వెళ్లి..అక్కడినుంచి బ్రిటన్ వెళ్లిన సునక్ పూర్వీకుల గత చరిత్ర గుర్తుచేస్తూ…ఆయన్ను ఓ బ్రిటషర్‌గానే చూడాలన్న అభిప్రాయమూ వినిపించింది. రిషి సునక్ దేశభక్తి మొత్తం బ్రిటన్‌తోనే ముడిపడి ఉంటుందని, ఆయనతో భారత్‌కు ప్రత్యేకంగా కలిగించే ప్రయోజనమేమీలేదని విశ్లేషణలు వెలువడ్డాయి. కన్సర్వేటివ్ పార్టీ నేత కోసం జరిగిన ప్రచారంలో ఎక్కడా రిషి సునక్ తన భారతీయతను చెప్పుకోలేదని…అసలు సగటు భారతీయుని జీవనానికి, రిషిసునక్‌కు సంబంధమే లేదని నిపుణులు వివరించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

అయితే రిషిసునక్‌ను భారత్ తమ వాడిగా భావించడానికి..ఆయన పూర్వీకులతో పాటు….వివాహమూ కారణం. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షతను రిషి పెళ్లిచేసుకోవడం వల్లే..ఆయన భారతీయులుకు మరింత దగ్గరి వ్యక్తిగా కనపడుతున్నారు. పూర్వీకులు భారతీయులు కావడం, ఇప్పుడు భారత్ అల్లుడు కావడంతో పాటు….ఆయన అనుసరిస్తున్న మత నమ్మకాలు కూడా మరోకారణం. 2020లో ఎక్స్‌చెకర్ చాన్సలర్‌గా రిషిసునక్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆవును పూజిస్తారు. తాను హిందూమతాన్ని అనుసరిస్తానని బహిరంగంగానే చెప్తారు. పూజలు చేస్తారు. ఇదే మనకు సునక్‌ను దగ్గరి వ్యక్తిగా మార్చింది. రిషి సునక్‌తో ఏవో ప్రయోజనాలు భారత్‌కు కలుగుతాయని నమ్మేవారికంటే…మన మూలాలున్న వ్యక్తి..ఆ స్థాయికి ఎదగడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనై సునక్‌ గురించి మాట్లాడుకుంటున్నవారే ఎక్కువ.

అయితే ఇప్పుడు జరుగుతున్న మరో చర్చ…అసలు రిషి సునక్…భారతీయ మూలాలున్న వ్యక్తా..పాకిస్థాన్ మూలాలున్న వ్యక్తా అని. రిషి పూర్వీకుల చరిత్ర గమనిస్తే..రిషి తాత భారత్‌ను విడిచిపెట్టేనాటికి…దేశం విడిపోలేదు. అవిభక్తభారత్‌లోని గుజ్రన్‌వాలా అనే నగరం రిషి సునక్ తాత స్వస్థలం. అక్కడినుంచే వారు..1935లో ముందుగా కెన్యా వెళ్లారు. ఆ తర్వాత.. రిషి తల్లిదండ్రులు కెన్యా నుంచి బ్రిటన్‌కు వలసపోయారు. అక్కడే సౌతాంప్టన్‌లో రిషి పుట్టిపెరిగారు. గుజ్రన్‌వాలా నగరం ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది. రిషి మనవాడని మనం ఎలా సంబరాలు చేసుకుంటున్నామో..పాకిస్థానీలు అలాగే మాట్లాడుకుంటున్నారు. గుజ్రన్‌వాలా ప్రజలు రిషి సునక్‌కు మద్దతుగా బ్యానర్లు కట్టుకున్నారు. గుజ్రన్‌వాలా బిడ్డ…బ్రిటన్‌కు మొదటి హిందూ ప్రధాని హిందూ ప్రధాని అయ్యారు అన్న బ్యానర్లు నగరమంతా కనిపిస్తున్నాయి. ఈ బ్యానర్ల తర్వాత రిషి భారతీయుడా..పాకిస్థానా అని చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కశ్మీర్‌పై ఆయన భారత్‌కు మద్దతిస్తారా..పాకిస్తాన్‌ను సమర్థిస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

Russia-Ukraine War : పుతిన్‌ని పదవి నుంచి తప్పించే యత్నాలు..! దీని కోసం రష్యాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయంటున్న వీడియా!!

రిషి పూర్వీకులు…భారత్‌ను విడిచిపెట్టేనాటికి దేశం విడిపోలేదు కాబట్టి…వారు భారతీయులే అని కొందరు వాదిస్తుంటే…ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది కాబట్టి..పాకిస్థానీ అని ఆ దేశవాసులు అంటున్నారు. అయితే ఆయన తాత..ఏ దేశంలో పుట్టిపెరిగినప్పటికీ..రిషిని అచ్చమైన బ్రిటిషర్‌గానే చూడాలని…ఆ దేశం కోసమే ఆయన పనిచేస్తారన్న విషయాన్ని మర్చిపోవద్దని అంతర్జాతీయ నిపుణులు సలహాలిస్తున్నారు.