Russia-Ukraine War : పుతిన్‌ని పదవి నుంచి తప్పించే యత్నాలు..! దీని కోసం రష్యాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయంటున్న మీడియా!!

రష్యా, యుక్రెయిన్ యుద్ధం పుతిన్ పదవికి ఎసరు తెచ్చిందా.?? పుతిన్‌ని పదవి నుంచి తప్పించే యత్నాలు జరుగుతున్నాయా? అంటే నిజమేనంటోంది యుక్రెయిన్. పుతిన్ ను పదవి నుంచి తప్పించటానికి రష్యాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయంటోంది.

Russia-Ukraine War : పుతిన్‌ని పదవి నుంచి తప్పించే యత్నాలు..! దీని కోసం రష్యాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయంటున్న మీడియా!!

Russian officials are planning to remove Putin..says Ukraine

Russia-Ukraine War : రష్యా, యుక్రెయిన్ యుద్ధం పుతిన్ పదవికి ఎసరు తెచ్చిందా.?? యుద్ధం ముగిసేలోపు పుతిన్‌కు పదవీ వియోగమవుతుందా..? యుక్రెయిన్ ప్రచారంలో నిజం ఎంత? అసలు రానున్న రోజుల్లో యుద్ధం ఏ మలుపు తీసుకోనుంది? రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఈ 8 నెలలుగా నిరంతరాయంగా సాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. కానీ యుద్ధం ముగిసేలోపు రష్యా రాజకీయాల్లో పెనుకుదుపు తప్పదన్నది యుక్రెయిన్ చేస్తున్న ప్రచారం. పుతిన్‌ను పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు రష్యాలో ప్రయత్నాలు జరుగుతున్నాయని యుక్రెయిన్ చెబుతోంది. అధికారులు ఇప్పటికే దీనిపై విస్తృత చర్చలు జరుపుతున్నారని తెలిపింది. యుక్రెయిన్ మేజర్ జనరల్ కైరిలో బుదనోవ్ ఈ విషయం చెప్పినట్టు ది మిర్రర్ ప్రకటించింది.

యుద్ధం మొదలైన దగ్గరినుంచి రష్యాకు వ్యతిరేకకంగా అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారంలో పుతిన్‌కు పదవీగండం అన్నది కూడా ఒకటి. యుద్ధాన్ని రష్యా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అది తిరుగుబాటుగా మారుతుందని ఓ సారి, యుద్ధంలో రష్యా అనుకున్నంత వేగంగా లక్ష్యాలు సాధించకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తితో ఉందని…ఇది పుతిన్‌ పదవికి ఎసరు తెస్తుందని ఇంకోసారి, పాశ్చాత్యదేశాల ఆంక్షలతో ఓల్గారిచ్‌లుగా పిలిచే రష్యా సంపన్నులు…తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారంతా పుతిన్‌ను అధ్యక్షపదవి నుంచి తొలగిస్తారని మరోసారి మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. కానీ అవేవీ నిజం కాదని..పదే పదే రుజువవుతోంది. అయినా ఈ ప్రచారానికి తెరపడడం లేదు. ఇక ఆయన అనారోగ్యంపైనా పుంఖానుపుంఖానుగా కథనాలు వచ్చాయి. పుతిన్ తీవ్ర అస్వస్థతతో ఉన్నారని, ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందనీ ప్రచారం జరిగింది. కానీ నాలుగు ప్రాంతాల విలీనం సందర్భంగా క్రెమ్లిన్‌లో జరిగిన విజయోతవ్సవ వేడుకలకు హాజరై అందరి అనుమానాలూ పటాపంచలు చేశారు పుతిన్.

నిజానికి రష్యాలో ఏం జరుగుతోందన్నదని మిగిలిన ప్రపంచానికి చాలా తక్కువగా తెలుస్తోంది. యుద్ధం తర్వాత పాశ్చాత్య మీడియా మొత్తం పుతిన్ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో అసలు నిజాలు కన్నా..అవాస్తవాలు ఎక్కువగా రష్యాగురించి, పుతిన్ గురించి ప్రచారమవుతున్నాయి. వాస్తవ పరిస్థితులు గమనిస్తే..పుతిన్ రష్యాలో అత్యంత బలమైన నేతగా ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా రష్యాను శాసిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పుతిన్ కనుసన్నల్లోనే రష్యా రాజకీయాలు నడుస్తున్నాయి. యుద్ధంపైనా అమెరికా, ఇతర దేశాలు ప్రచారం చేస్తున్నట్టు రష్యా ప్రజల్లో అంత వ్యతిరేకత లేదు. యుద్ధం అనుకున్న లక్ష్యాలను సాధించినా…లేకపోయినా….రష్యాకు పునర్‌వైభవం తెచ్చే ఓ ప్రయత్నం జరుగుతోందన్నది మెజార్టీ రష్యన్ల అభిప్రాయం. యుద్ధాన్ని సహజంగా వ్యతిరేకించేవారు సైతం…రష్యా నాలుగు యుక్రెయిన్ ప్రాంతాలను విలీనం చేసుకున్న తర్వాత మౌనంగా ఉంటున్నారు. అయితే మొబిలైజేషన్‌ను మాత్రం రష్యా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. యుక్రెయిన్ పౌరుల్లా యుద్ధరంగంలోకి వచ్చి పోరాడేందుకు వారు సిద్ధంగా లేరు. ఈ ఒక్క విషయం తప్ప మిగిలిన ఏ సందర్భాల్లోనూ మాస్కోలో పుతిన్ వ్యతిరేకత కనిపించలేదు. ప్రజల్లో భారీ వ్యతిరేకత, తాను పదవికి దూరమయ్యే, ప్రభుత్వం కూలిపోయే పరిస్థితే ఉంటే…పుతిన్ ఇప్పటిదాకా యద్ధమే కొనసాగించేవారు కాదన్నది అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నమాట.

70 ఏళ్ల పుతిన్…రష్యాకు సుదీర్ఘలక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సోవియట్ యూనియన్ పతనాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పుతిన్..అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యాను అంతర్జాతీయంగా పటిష్టంగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచ్ఛన్నయుద్ధంలో ఓటమి తర్వాత పరపతి కోల్పోయిన రష్యాకు ఒకనాటి వైభవం మళ్లీ దక్కాలంటే…సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న దేశాలన్నింటినీ తిరిగి రష్యాలో కలుపుకోవాలన్నది పుతిన్ ఆలోచన. సోవియట్ యూనియన్ దేశాలను, నిధులు, అభివృద్ధికార్యక్రమాలతో తమవైపుకు తిప్పుకున్న అమెరికా, యూరప్ దేశాలకు చెక్‌పెట్టాలన్నది పుతిన్ దీర్ఘకాలికలక్ష్యం. యుక్రెయిన్‌ను నాటోలో చేర్చుకునేందుకు చర్చలు మొదలైన తర్వాత పుతిన్ ఇక చూస్తూ ఉండలేకపోయారు. నాటోలో యుక్రెయిన్‌ను చేర్చుకుని…బలగాలను రష్యా సరిహద్దుల్లోకి తెచ్చి పక్కెలో బల్లెంలా మారాలన్న అమెరికా ఎత్తుగడను తిప్పికొట్టేందుకు యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధం తర్వాత దేశాన్ని స్థిరంగా నిలిపారు. ఆంక్షలు పేరుతో రష్యా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చాలన్న శత్రుదేశాల వ్యూహానికి మించిన ప్రతివ్యూహాలు రచించి…షాకిచ్చారు. దీంతో పుతిన్‌పై భారీ ఎత్తున వ్యతిరేకప్రచారం చేస్తోంది అంతర్జాతీయ మీడియా.