కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్ లో కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్

CoWIN portal దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడినవారందరికీ మే-1నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం..ఇందుకు సంబంధించి కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

నిన్నటివరకు 45ఏళ్లు దాటినవాళ్లకు మాత్రమే వాక్సిన్ రిజిస్ట్రేషన్ తెరిచి ఉండగా..నేటి నుంచి 18-44ఏళ్ల మధ్య వయస్సు వారి కోసం తెరుచుకుంది. కాగా, ఉదయం నుంచి ఇప్పటివరకు 18ఏళ్లు పైబడిన కోటిమందకి పైగా మత పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని కోవిన్ యాప్ చీఫ్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.

అయితే, ఎక్కువమంది ఒక్కసారిగా యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు సర్వర్ కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదుర్కొంది. సాయంత్రం 4గంటల సమయంలో చిన్న అంతరాయం వచ్చిందని,వెంటనే డెవలపర్స్ వాటిని ఫిక్స్ చేశారని,ప్రస్తుతం పోర్టల్ బాగానే పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు