కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో నెట్ వర్క్ ప్రాబ్లం…నిలిచిపోయిన సర్వీసులు

కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో లోకల్ ఏరియా నెట్ వర్క్ ప్రాబ్లం వచ్చింది.ఇవాళ(మే-13,2019)సాయంత్రం 5:15గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ లు బోర్డింగ్ పాస్ లను ఇష్యూ చేయడం స్టార్ చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయింది.దీంతో 20కి పైగా విమానాలు ఆలస్యంగా గాల్లోకి ఎగరనున్నాయి.ఫ్లయిట్ ఇన్షర్మేషన్ డిస్ ప్లే సిస్టమ్,కెమెరాలు కూడా పనిచేయడం లేదు.మరోవైపు విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎయిర్ పోర్ట్ లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఐటీ టీమ్ ఇష్యూపై వర్క్ చేస్తుందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.