Marriage
Bachelors: దేశవ్యాప్తంగా అమ్మాయిల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలామంది అబ్బాయిలు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. పెళ్లిగాని మగపిల్లలను చూస్తూ.. తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. ఉద్యోగాల వేటలో పడిన యువత లేటు వయసు వరకూ ఆగడం ఒక కారణమైతే, పెళ్లి చేసుకోవడానికి అసలు అమ్మాయి దొరక్కుండాపోవడం మరో కారణం.
మల్లీశ్వరి సినిమా గుర్తుందా? అందులో హీరో వెంకటేష్ క్యారెక్టర్ పేరు ప్రసాదు.. బ్యాంకులో పని చేస్తుంటాడు. పెళ్లి కాకపోవడంతో చుట్టుపక్కల వారంతా పెళ్లికాని ప్రసాదూ.. అని పిలుస్తుంటారు. ఇప్పుడు వెంకటేష్ పరిస్థితే తమిళనాడు రాష్ట్రంలో కొంతమంది బ్రాహ్మణ యువకులకు ఎదురవుతోంది. 30 ప్లస్ వచ్చినా పెళ్లిళ్లు కావట్లేదంట. సుమారు 40వేల మందికి ఇదే సమస్యగా ఉందంట.. ఆ కులంలో.. దీంతో ఆ వర్గమే.. తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్.. వారికి అమ్మాయిలను వెతికే పనిలో పడ్డారు.
లేటెస్ట్ లెక్కల ప్రకారం.. ఆ రాష్ట్రంలో 30ఏళ్ల నుంచి 40ఏళ్ల వయస్సు ఉన్న 40వేల మందికి పెళ్లి కాలేదు. రాష్ట్రంలో 10మంది అబ్బాయిలకు ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రల్లో ఢిల్లీ, లక్నో, పట్నా వంటి ప్రాంతాల్లో కూడా అమ్మాయిలను వెతికే పనిలో పడ్డారు. హిందీ చదవడం.. రాయడం వచ్చినవారిని అక్కడ కొంతమందిని కూడా నియమించారు బ్రాహ్మణ సంఘం వారు.
Girl Child: ఆడపిల్ల పుడితే గిఫ్ట్‌గా రూ. 10వేలు.. ఆదర్శగ్రామంలో సర్పంచ్ ప్రకటన
ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే కాదు.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎక్కువగా రెడ్డి, కమ్మ, వైశ్య, వెలమ, బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీరు సొంతకులంలో చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్లేదు. దారుణంగా పడిపోతున్న లింగనిష్పత్తే ఇందుకు కారణం. మెజారిటీ అమ్మాయిలు NRIలు, సాఫ్ట్‌వేర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న అబ్బాయిలవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో కాస్త తక్కువ ఆదాయం ఉన్నవారికి పెళ్లి కావడం కష్టంగా మారుతోంది.