ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేందుకు జమ్మూకశ్మీర్ యువత ఉత్సాహంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూకశ్మీర్ లోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది యువకులు ఉత్సాహంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటున్నారు.
దేశ సేవ కోసం ఆర్మీలో చేరుతున్నామని, దేశం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని ర్యాలీలో పాల్గొన్న యువకులు చెబుతున్నారు.ఏడు రోజుల పాటు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఇవాళ(సెప్టెంబర్-3,2019)రియాసిలో జరిగిన రిక్రూట్మెంట్ ర్యాలీలో 500మందికి పైగా యువకులు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా 29వేల అప్లికేషన్స్ వచ్చినట్లు ఆర్మీ తెలిపింది.
Indian Army is organising first Army Recruitment Rally in J&K after abrogation of Article 370&Article 35A. The 7-day Recruitment Rally through Army Recruitment Office, Jammu,commenced today at Subsidiary Training Centre of J&K Police at Talwara, Reasi & will continue till Sep 9. pic.twitter.com/494cXQlE2g
— ANI (@ANI) September 3, 2019