Over 70 Per Cent Of Covid Patients Above 40 Years In Both Waves Older Population Still More Vulnerable
Covid patients కరోనా రెండు దశల్లోనూ 70 శాతం కన్నా ఎక్కువ మంది కరోనా పేషెంట్లు 40 ఏళ్లు దాటినవారే ఉన్నారని సోమవారం కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వృద్ధలకు వైరస్ సంక్రమణకు ఎక్కువ అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బల్‌రామ్ భార్గవ్ మీడియాతో మాట్లాడుతూ..ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్యలో పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. అయితే సెకండ్ వేవ్‌లో… ఎక్కువ శాతం కేసుల్లో ఆక్సిజన్ అవసరం వచ్చిందని..వెంటిలేటర్ అవసరం అంత ఎక్కువగా లేదని తెలిపారు. సెకండ్ వేవ్‌లో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నా.. మరణాల సంఖ్య తక్కువగానే ఉందన్నారు.
కరోనా సెకండ్ వేవ్ లో ఊపిరి ఆడటం తగ్గడం వంటి సందర్భాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని,అయితే, గొంతు మంట మరియు పొడి దగ్గు మరియు ఇతర లక్షణాలు ఫస్ట్ వేవ్ లో ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మొదటి దశలో 41.5శాతం పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమైందని,సెకండ్ వేవ్ లో 54.5శాతం పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమైందని బల్‌రామ్ భార్గవ్ తెలిపారు. ఆక్సిజన్ వృధా జరగకూడదని, దానిని హేతుబద్ధం చేయాలని భార్గవ విజ్ఞప్తి చేశారు.
ప్రజల్లో తీవ్ర నిర్లక్ష్యం ఉందని, కోవిడ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘిస్తున్నారని ఆయన అన్నారు. గుర్తులేని మ్యుటేషన్ల వల్ల కూడా కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు ఆరోపించారు. యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా వేరియంట్లు అధిక స్థాయిలో వ్యాపిస్తున్నట్లు బల్‌రామ్ భార్గవ్ వెల్లడించారు. భారత్ లో ఓ డబుల్ మ్యూటెంట్‌ను గుర్తించామని, అయితే ఆ మ్యూటెంట్ ఎంత వేగంగా విస్తరిస్తుందో ఇంకా గుర్తించలేదన్నారు. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష అత్యంత కచ్చితమైందని, ఈ పరీక్ష ద్వారా రెండు జన్యువులను లేదా అంత కన్నా ఎక్కువే పరిశీలిస్తామని, ఈ పరీక్ష వల్ల ఎటువంటి మ్యూటెంట్లను అయినా కనిపెడతామన్నారు.