Oxygen Tankers : కరోనాపై పోరులో భారత్‌కు ప్రపంచ దేశాల అండ..యూకే, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు

కరోనాపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపించడంతో అత్యవసరంగా సాయం చేస్తున్నాయి.

Oxygen tankers from the UK and France : కరోనాపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపించడంతో అత్యవసరంగా సాయం చేస్తున్నాయి. యూకే నుంచి కీలకమైన వైద్య పరికరాలు భారత్ చేరుకున్నాయి. 100 వెంటిలేటర్లతో పాటు… 95 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను యూకే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీకి పంపించింది. లుఫ్తాన్సా విమానంలో తెల్లవారుజామున వైద్య పరికరాలు భారత్ చేరుకున్నాయి.

మరోవైపు ఫ్రాన్స్‌ నుంచి ఐదు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు భారత్‌కు రానున్నాయి. అధిక సామర్ధ్యం గల 8 ఆక్సిజన్ జనరేటర్లు, ఐసీయూ పరికరాలు, 28 వెంటిలేటర్లు భారత్‌కు ఇవ్వాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. 8 ఆక్సిజన్ జనరేటర్లను పదేళ్ల పాటు వినియోగించుకోవచ్చు…

ట్రెండింగ్ వార్తలు