చిదంబరానికి అస్వస్థత : ఎయిమ్స్ కు తరలింపు

  • Publish Date - October 28, 2019 / 02:28 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం అనారోగ్యానికి గురయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటూ సెప్టెంబరు 6 నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు చిదంబరాన్ని ఎయిమ్స్ కు తరలించారు.   

తీవ్రమైన కడుపు నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు రావటం వల్ల ఆయన్నుఅక్టోబరు 28,  సోమవారం ఉదయం మొదట రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించిన అనంతరం..మెరుగైన చికిత్స కోసం సాయంత్రం ఎయిమ్స్ కు తరలించారు. 
  
చిదంబరం ఆరోగ్య పరిస్ధితి బాగోలేదని, హైదరాబాద్ లో ఆయనకు చికిత్స చేయించేందుకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. మరోవైపు ఆయనను 7 రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు ఇవ్వాలని ఈడీ కోరింది. ఈరోజుతో చిదంబరం ఈడీ కస్టడీ ముగియాల్సి ఉంది.