కశ్మీర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని పాములతో బెదిరింపులకు పాల్పడిన పాకిస్థాన్ సింగర్ రబీ ఫిర్జాడాకు జరిమానా విధించారు.
కశ్మీర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని పాములతో బెదిరింపులకు పాల్పడిన పాకిస్థాన్ సింగర్ రబీ ఫిర్జాడాకు జరిమానా విధించారు. మూగ జీవాలను బంధించడం నేరంగా పరిగణిస్తూ వైల్డ్ లైఫ్ డిపార్ట్ మెంట్ అధికారులు రబీకి జరిమానా విధించారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై పాక్ మండిపడుతోంది. పలు ఆంక్షలు విధించింది. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రబీ మోడీని విమర్శిస్తూ తన ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్లో వీడియోను పోస్టు చేసింది.
విష సర్పాలతో పాటు మొసళ్లను మోడీకి గిఫ్ట్ గా పంపిస్తానని వీడియోలో ఆమె చెప్పడం వివాదాస్పదమైంది. బెదిరింపులకు పాల్పడినందుకు సింగర్ రబీపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో రబీ దోషిగా తేలితే.. జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
వీడియోలో కనిపించిన పాములు, మొసళ్లు.. తనవి కావని, వీడియో చేయడం కోసం ఒకరి దగ్గరి నుంచి అద్దెకు తీసుకోచ్చింది. తన వీడియో వివాదాస్పదం కావడంతో వివరణ కోసం మరో వీడియో చేసింది. ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లుగా చాలా టీవీ ఛానళ్లలో ఇదే పాములతో కనిపించాను. అప్పట్లో ఎవరూ దీనిపై చర్యలు తీసుకోలేదు.
దురదృష్టవశాత్తూ.. ఇప్పుడు మోడీని విమర్శించడంతో నాపై చర్యలు తీసుకుంటున్నారు’ అని తెలిపింది. భారతీయులను ఎన్నడూ విమర్శించలేదు. నా టార్గెట్ మోడీ మాత్రమేనని చెప్పింది. వైల్డ్ లైఫ్ డిపార్ట్ మెంట్ నుంచి రాతపూర్వకంగా తనకు ఎలాంటి నోటీసు అందలేదని, ఒకవేళ ఏదైనా వస్తే.. లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తానని రబీ తెలిపింది.
ایک کشمیری لڑکی کی تیاری مودی کے خلاف، ویسے تو اس نے جہنم میں جانا ہی ہے، مگر اس جیسے انسا ن کی دنیا بھی جہنم ہونی چاہیے۔ #chotisibaathttps://t.co/cGfxSd0hd5 pic.twitter.com/h3C9HA1BT0
— Rabi Pirzada (@Rabipirzada) September 2, 2019