పాకిస్తాన్ ఆర్మీ మానసికంగా హింసించింది : అభినందన్

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ ఎట్టకేలకు నోరు విప్పారు. పాకిస్తాన్ ఆర్మీ తనను మానసికంగా హింసించిందని తెలిపారు.

  • Publish Date - March 2, 2019 / 02:48 PM IST

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ ఎట్టకేలకు నోరు విప్పారు. పాకిస్తాన్ ఆర్మీ తనను మానసికంగా హింసించిందని తెలిపారు.

ఢిల్లీ : ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ ఎట్టకేలకు నోరు విప్పారు. పాకిస్తాన్ ఆర్మీ తనను మానసికంగా హింసించిందని తెలిపారు. ’మనదేశం గురించి ఎన్నో ప్రశ్నలు సంధించారు’ అని పేర్కొన్నారు. శారీరకంగా హింసించలేదు కానీ మానసికంగా వేధించారు’ అని ఐబీ విచారణలో అభినందన్ వెల్లడించారు. 48 గంటల పాక్ చెరలో ఉన్న అభినందన్…పాక్ అధికారులు వేధించారని తన మనో గతాన్ని చెప్పారు.

ఫిబ్రవరి 27 బుధవారం పాక్ చెరలో చిక్కిన నాటి నుంచి మార్చి 1 శుక్రవారం రాత్రి 9.20 గంటలకు వరకు కూడా అభినందన్ పాక్ చెరలో ఉన్నారు. ఫిబ్రవరి 27న ఉదయం 10 గంటల సమయంలో మిగ్ 21 నుంచి అభినందన్ పాకిస్తాన్ భూభాగంలో పడిపోయారు. పాక్ ఆర్మీ కానీ, పాక్ అధికారులు అతనితో వ్యవహరించిన తీరుపట్ల అభినందన్ మనస్తాపానికి గురయ్యారు.

’భౌతికంగా, శారీరకంగా ఎటువంటి దాడులు జరుపలేదు కానీ..తనను మానసికంగా వేధించారని అభినందన్ పేర్కొన్నారు. ’భారత్ ఎటువంటి ఆపరేషన్ చేపట్టింది.. ఏ విధంగా జైషే ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిపారు.. అందులో నేను ఉన్నానా ?’ అన్న విషయాలపై పాక్ అధికారులు గుచ్చి గుచ్చి అడిగారని చెప్పారు. అయితే చాలా అంశాలకు అభినందన్ సమాధానం తెలుపనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మెడికల్ గా చికిత్స పొందుతున్నారు. విచారణలో మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశముంది. 

తనను పాకిస్తాన్ అధికారులు క్షేమంగా చూసుకుంటున్నారని.. ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదని.. అభినందన్ కు ’కీ’ ఇచ్చి మరీ వీడియోను రికార్డు చేశారు పాక్ అధికారులు. అప్పుడు అభినందన్ చెప్పిన విషయాలకు ఇప్పుడు చెప్తున్న విషయాలకు తేడా ఉంది. మానసికంగా తనను వేధించారనే విషయాన్ని అభినందన్ బయటపెట్టారు. ’రా’ ఇంటెలిజెన్స్ అధికారులు అతన్ని విచారణ చేయనున్నారు. నార్కో టిక్ పరీక్షలు చేసే అవకాశం ఉంది. అతనికి డ్రగ్స్ ఇచ్చారా? అనే అంశాలపై రెండో.. మూడు రోజులు దర్యాప్తు కొనసాగనుంది. భారత్ కు సంబంధించిన మిషన్స్, భారత్ ఇంకా ఎటువంటి చర్యలకు పూనుకుంటుంది? ఉగ్రవాద సంస్థలపై దాడులకు సంబంధించిన ప్రశ్నలు పాక్ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.