CPECపై చైనా ఆందోళనలే భారత్‌తో జగడానికి కారణమా?

ఆక్సాయ్ చిన్ మరియు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్(CPEC)పై డ్రాగన్ దేశపు ఆందోళనలే… ప్రస్తుతం లఢఖ్ లోని సరిహద్దు దగ్గర భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణకు కారణంగా తెలుస్తోంది.

ఆర్టికల్ 370రద్దుతో చైనాలో ఆందోళనలు
గతేడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసి.. జమ్మూకశ్మీర్ ,లఢఖ్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత చైనా ఆలోచనలో వ్యూహాత్మక మార్పు చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం చైనా పాలనలో ఉన్న ఆక్సాయ్ చిన్ మనదే అంటూ భారత్ వాదనను వినిపిస్తూనే ఉంది. కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ లో ఆక్సాయ్ చిన్ భాగమని భారత్ తేల్చిచెబుతోంది. అయితే జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదాను రద్దు చేసిన తరువాత చైనాలో ఈ ఇష్యూ తిరిగి అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోందని ట్రాన్స్ హిమాలయన్ అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన కిర్గిస్తాన్ మాజీ రాయబారి స్టోబ్డాన్ చెప్పారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) లోని గిల్గిట్-బాల్టిస్తాన్ గుండా వెళుతున్న CPEC-ఇండియన్ ఓషన్..హిందూ మహాసముద్రానికి చైనా యొక్క వ్యూహాత్మక మార్గం పూర్తిగా కొత్త కారకంగా ఉద్భవించిందని, చైనా మరియు పాకిస్తాన్ల మధ్య ఇప్పటికే ఉన్న బలమైన భద్రతా సంబంధాన్ని ఇది మరింత బలోపేతం చేసిందని స్టోబ్డాన్ తెలిపారు. పాక్ ఆధీనంలో ఉన్న బెలూచిస్తాన్ లోని గద్వార్ పోర్ట్ కు మార్గం కల్పిస్తూ మరియు చైనా యొక్క అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే గేట్ వే…మలాకా జలసంధిపై ఆధిపత్యం వహించే అమెరికన్లపై బీజింగ్ దాని దాడిని తగ్గించడానికి CPEC ఉపయోగపడుతుంది కనుక చైనాకు పాకిస్తాన్ చాలా ముఖ్యమైనదిగా మరింది. సినో-పాక్ బంధం బలోపేతానికి CPEC వ్యూహాత్మకమైన గేమ్ ఛేంజింగ్ గా మారింది.

CPEC లో ఇప్పటికే చైనా ప్రతిష్టను చాటుకుంది. బీజింగ్ నేతృత్వంలోని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) యొక్క ప్రధానమైనదిగా ఇది ప్రదర్శించబడింది కనుక CPEC విఫలమవడం చాలా పెద్ద పనే. అయితే ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కారిడార్ రూట్ లో గిల్గిట్-బాల్టిస్తాన్ సహా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) ను కవర్ చేసే CPEC ఫ్లాన్ పెద్ద సవాల్ గా మారింది.

గత ఏడాది ఆగస్టు 6 న లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ…పీఓకే, అక్సాయ్ చిన్‌లపై భారత్ వాదనలను నిస్సందేహంగా తెగేసిచెప్పిన విషయం తెలిసిందే. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, దానిపై ఎటువంటి సందేహం లేదు. జమ్మూ కాశ్మీర్ గురించి తాను మాట్లాడినప్పుడు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మరియు అక్సాయ్ చిన్ ఇందులో చేర్చబడ్డాయి అని అమిత్ షా ఆ సమయంలో అన్నారు.

జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, మరియు పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్న రాష్ట్రంలోని కొన్ని భాగాలను ఖాళీ చేయాలని ఫిబ్రవరి 1994 లో పార్లమెంటు చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఈ సందర్భంగా అమిత్ షా ప్రస్తావించారు. అంతేకాకుండా, నవంబర్ 14, 1962న పార్లమెంటు ఆమోదించిన తీర్మానం… అక్సాయ్ చిన్ మరియు చైనా ఆక్రమించిన లేదా స్వాధీనం చేసుకున్న జమ్మూకశ్మీర్ యొక్క ఇతర ఏరియాలను తిరిగి పొందటానికి భారతదేశం కమిట్ అయి ఉన్నట్లు చెబుతోంది.

చైనీస్ వాదాన
భౌగోళిక-వ్యూహాత్మక పరిశీలనలను ఉటంకిస్తూ… అక్సాయ్ చిన్ తమకు చెందినదని చైనీయులు పట్టుబడుతున్నారు. వాయువ్య చైనాలోని స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం జిన్జియాంగ్ మరియు టిబెట్ మధ్య అక్సాయ్ చిన్ ముఖ్యమైన లింక్ మరియు చైనా యొక్క జాతీయ రహదారి 219 ఈ మార్గం గుండా వెళుతుంది. ఆశ్చర్యకరంగా, గత ఏడాది ఆగస్టు12న… జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదాను తొలగించిన నేపథ్యంలో అక్సాయ్ చిన్ మరియు పాకిస్తాన్ రెండింటిపై భారత దృక్పథం గురించి వ్యాఖ్యానించేందుకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను తమ దేశాన్ని సందర్శించాలని చైనా కోరింది.

బీజింగ్ లో భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ భారతీయ మీడియాతో మాట్లాడుతూ….అక్సాయ్ చిన్ కాకుండా, జమ్మూకశ్మీర్ లో మార్పుల ఫలితంగా భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను గురించి చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి కూడా ప్రస్తావించారన్నారు. ఆర్టికల్ 370 యొక్క ఉపసంహరణ నియంత్రణ రేఖ(LOC)పై ప్రభావం చూపలేదు అని విదేశాంగ మంత్రి చైనా ప్రతినిధికి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) కు ఎటువంటి చిక్కులు లేవు. భారతదేశం అదనపు ప్రాదేశిక(ఒకరి ఆధీనంలో ఉన్న భూభాగం)వాదనలను లేవనెత్తలేదు. ఈ విషయంలో చైనా ఆందోళనలు తప్పుగా ఉన్నాయని ఆయన అన్నారు.

అయితే ఆగస్టు-5న ఆర్టికల్ 370రద్దు తర్వాత పాకిస్తాన్ తోనే చైనా నిలిచింది. పాక్ కు అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తూ వచ్చింది. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి యుఎన్ తీర్మానాలు మరియు యుఎన్ చార్టర్‌ను ప్రాతిపదికగా పేర్కొంటూ ఇస్లామాబాద్‌ కు తన సహాయ సహాకారాలు అందిస్తూ భారత వైఖరిని చైనా తప్పుబట్టింది.

అయితే పీఓకే లొకేషన్స్ కోసం వాతావరణ సూచనలు(weather bulletins) జారీ చేయాలని భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం…చైనా-పాక్ ల మధ్య మరింత బంధాలను ఏర్పరచి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. వీరి సంబంధం CPEC తరువాత తాజా భౌగోళిక రాజకీయ ఎత్తును పొందింది. CPECను బలోపేతం చేసే దృష్ట్యా…1963 లో పాకిస్తాన్ చైనాకు అప్పగించిన గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని షాక్స్‌గామ్ లోయలో ఉన్న టాక్స్కోర్గాన్ దగ్గర బ్రాండ్ న్యూ హై-ఆల్టిట్యూడ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు చైనా అధికార మీడియా గత నెల చివర్లో ప్రకటించింది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడినప్పటినుంచి భారతదేశం మరియు అమెరికాల మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి చైనా యొక్క ఆందోళనలే… ప్రస్తుతం భారతదేశం-చైనా సంబంధాలలో పెరుగుతున్న వైరుధ్యానికి కారణమవుతున్నాయి.

భారతదేశం యొక్క తీవ్రమైన కార్యాచరణ
2014 నుండి సరిహద్దుల వెంట భారతదేశం యొక్క తీవ్రమైన మరియు పెద్దఎత్తున రహదారి నిర్మాణ కార్యకలాపాలు భారత్-చైనాల మధ్య పెరుగుతున్న అపనమ్మకానికి దారితీసినట్లు కనిపిస్తోంది. దశాబ్దాల నిర్లక్ష్యం తరువాత, సరిహద్దుల వెంబడి భారతీయ రహదారి నిర్మాణ కార్యకలాపాలను చైనీయులు జీర్ణించుకోలేకపోతున్నారు అని నిపుణులు చెబుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌తో మొదలై కాశ్మీర్‌తో సహా, దక్షిణ మరియు నైరుతి ఆసియాలో ప్రాంతీయ భౌగోళిక రాజకీయ నిర్మాణంలో చాలా పెద్ద మార్పునకు ప్రస్తుతం లడఖ్‌లో నెలకొన్న ప్రతిష్ఠంభన ఒక పాయింటర్ అని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతదేశం మరియు చైనా మధ్య చాలా విస్తృత మరియు లోతైన దౌత్య సంభాషణ అవసరమని చెబుతున్నారు.