Pakisthan Drones Enter India : పాక్ నుంచి భారత్‌కు డ్రోన్లతో డ్రగ్స్, ఆయుధాలు తరలింపు

pakisthan drones enter india with drugs : ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారత్ భూభాగంలోకి వచ్చే డ్రోన్ల సంఖ్య పెరిగింది. వాటిని ఆదిలోనే తుదముట్టిస్తోంది భారత్ ఆర్మీ జవాన్లు. నిత్య డేగ కళ్లతో కావలి కాస్తూ చిన్నపురుగు పాక్ నుంచి వచ్చిన వెంటనే పసిగట్టి నేలమట్టం చేస్తున్నారు. పాక్ ఎన్ని యత్నాలు చేసినా సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత్ ఆర్మీ. ఈక్రమంలో పాకిస్థాన్ మరోసారి తన వక్కబుద్ధిని చూపెట్టింది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు నిత్యం కొనసాగుతున్నాయి. దీంట్లోభాగంగా భారత భూభాగంలోకి డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను సరఫరా చేస్తోంది.

పంజాబ్ లోని ఫజిల్కా జిల్లా చురివాలా చుస్తీలో డోన్ ద్వారా డ్రగ్స్, ఆయుధాలను సరఫరాకు పాల్పడింది పాక్. పాక్ నుంచి భారత భూభాగంలోకి డ్రోన్ ద్వారా జారవిడిచిన డ్రగ్స్ ను..ఆయుధాలను భారత్ ఆర్మీ పసిగట్టింది. వాటిని స్వాధీనం చేసుకుంది. డ్రోన్ ద్వారా జారవిడిచిన 7.5కిలోల హెరాయిన్,పిస్టల్, 2 మ్యాగజైన్లు, 9ఎంఎం పిస్టకు చెందిన 50 బుల్లెట్లను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. వీటిని విడిచి డ్రోన్ తిరిగి పాకిస్థాన్ భూభాగం వైపుగా వెళ్లిపోవడాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది.

కాగా అమృత్‌సర్ జిల్లా చహర్‌పూర్ గ్రామ సమీపంలో డావోకే గ్రామ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి భారత్‌లోకి వస్తున్న డ్రోన్‌ను భద్రతా సిబ్బంది పసిగట్టి కూల్చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మరోసారి పాకిస్థాన్ కుటిలబుద్ధిని భారత్ ఆర్మీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సోమవారం (నవంబర్ 30,2022)భారత భూభాగంలోకి చొరబడుతున్న మరో డ్రోన్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా విభాగం కూల్చివేసింది. మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఒక డ్రోన్‌తో పాటు అనుమానాస్పద వస్తువును కూడా సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు