Panchkula : కారుతో ఢీకొట్టి బానెట్‌పై వైద్యుడిని 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన దుండగులు

ఢీకొన్న తర్వాత డాక్టర్ గగన్ కారును ఆపాలనుకున్నాడు. అతను కారులో ఉన్నవారితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఈ క్రమంలో కారులోని వ్యక్తులు ఢీకొట్టి అతనిని బానెట్‌ పై దాదాపు 50 మీటర్ల వరకు ఎత్తి ఈడ్చుకెళ్లారు. దుండగులు అక్కడి నుండి పారిపోయారు

doctor dragged car bonnet

Panchkula Doctor Dragged Car Bonnet : పంచకులలో దుండగులు ఓ వైద్యుడిని కారుతో ఢీకొట్టి బానెట్‌పై 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. రోడ్డుపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రవి దత్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఎమ్డీసీ నివాసి అయిన డాక్టర్ గగన్ తన కొడుకును ట్యూషన్ నుండి కారులో తఇంటికి తీసుకెళ్తున్నాడు. సెక్టార్ 8, పంచకుల ట్రాఫిక్ జంక్షన్‌లో డాక్టర్ గగన్ వాహనాన్ని మరో కారు ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించి ఢీకొట్టింది.

ఢీకొన్న తర్వాత డాక్టర్ గగన్ కారును ఆపాలనుకున్నాడు. అతను కారులో ఉన్నవారితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఈ క్రమంలో కారులోని వ్యక్తులు ఢీకొట్టి అతనిని బానెట్‌ పై దాదాపు 50 మీటర్ల వరకు ఎత్తి ఈడ్చుకెళ్లారు. దుండగులు అక్కడి నుండి పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Road Accident : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు లోయలో పడి 8 మంది కూలీలు దుర్మరణం

డాక్టర్ గగన్‌ను వెంటనే సెక్టార్ 6 ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ గగన్ ఫిర్యాదుతో పంచకుల పోలీసులు కారు యజమానిపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.