Withdrawal Of AFSPA : ఆ వివాదాస్పద చట్టం ఎత్తివేసే దిశగా కేంద్రం అడుగులు!

నాగాలాండ్​లో దశాబ్దాలుగా అమల్లో ఉన్న వివాదాస్పద "సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1958(AFSPA)"విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ

Delhi2

Withdrawal Of AFSPA : నాగాలాండ్​లో దశాబ్దాలుగా అమల్లో ఉన్న వివాదాస్పద “సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1958(AFSPA)”విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే అవకాశాలను పరిశీలించడానికి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

నాగాలాండ్‌, అసోం ముఖ్యమంత్రులు నియో ఫియు రియో, హిమంత బిశ్వ శర్మతో.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డిసెంబర్‌ 23న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులుగా ఉంటారని ఆదివారం నాగాలాండ్ సీఎం నియో ఫియు రియో తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రత్యేక అధికారాల చట్టంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుందన్నారు. కాగా, కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి(ఈశాన్యరాష్ట్రాలు), సీఎస్​, నాగాలాండ్​ డీజీపీ, అసోం రైఫిల్స్​ ఐజీ, సీఆర్​పీఎఫ్​ నుంచి ఓ ప్రతినిధి కమిటీ సభ్యులుగా ఉంటారు. 5 రోజుల్లోగా ప్యానెల్​ తమ ప్రతిపాదనలు, సూచనలు సమర్పించాల్సి ఉంటుంది. కమిటీ సిఫార్సుల మేరకు చట్టాన్ని తొలగించాలా, వద్దా అనేదానిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది.

అయితే, నాగాలాండ్​లో ఇటీవల సైన్యం జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత AFSPA చట్టాన్ని ఎత్తివేయాలని ఈశాన్య రాష్ట్రాల సీఎంల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు,నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి.

ఈ చట్టం.. భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది. దీని ప్రకారం..ఎలాంటి ముందస్తు వారెంట్​ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు.ఆపరేషన్లు నిర్వహించవచ్చు. బలగాలు ఎవరినైనా కాల్చి చంపినా.. వీరికి రక్షణ లభిస్తుంది. అయితే చాలా ఏళ్ల నుంచే ఈ వివాదాస్పద చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ..ఇటీవల ఘటన తర్వాత ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.

ALSO READ Covid Positive: ఒకే స్కూళ్లో 52మందికి కొవిడ్ పాజిటివ్