Tamil Nadu: బీజేపీలోకి అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్‭సెల్వం..! గుజరాత్‭లో కమల పార్టీ నేతలతో సమావేశం

వాస్తవానికి ఏఐడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన ఎడప్పాడి పళనిస్వామి(ఇపిఎస్‌)ని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. కానీ తనకు అదే రోజు వేరే ముఖ్యమైన పని ఉండడం మూలంగా హాజరు కాలేనంటూ భూపేంద్ర పటేల్‌కు లేఖ రాశారు. ఈ తరుణంలో పన్నీర్‭సెల్వం ప్రమాణ స్వీకారంలో కనిపించడం, బీజేపీ ముఖ్య నేతలతో కరచాలనం చేస్తూ మాట్లాడుతూ కనిపించడం పలు అనుమానాలకు తావునిస్తోంది

Tamil Nadu: తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‭సెల్వం పార్టీ మారబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏఐడీఎంకే పార్టీ నుంచి బహిష్కృణకు గురైన ఆయన, కమల పార్టీ ద్వారా తన మలిదశ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే పనిలో ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారానికి ఆయన గుజరాత్ వెళ్లారు. అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. దీంతో పన్నీర్‭సెల్వం పార్టీ మార్పు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

Uttar Pradesh: సమాజ్‭వాదీ పార్టీకి ఓటేయనందుకు నా భార్యను కాల్చి చంపారు.. యూపీ వ్యక్తి ఆరోపణ

వాస్తవానికి ఏఐడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయిన ఎడప్పాడి పళనిస్వామి(ఇపిఎస్‌)ని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. కానీ తనకు అదే రోజు వేరే ముఖ్యమైన పని ఉండడం మూలంగా హాజరు కాలేనంటూ భూపేంద్ర పటేల్‌కు లేఖ రాశారు. ఈ తరుణంలో పన్నీర్‭సెల్వం ప్రమాణ స్వీకారంలో కనిపించడం, బీజేపీ ముఖ్య నేతలతో కరచాలనం చేస్తూ మాట్లాడుతూ కనిపించడం పలు అనుమానాలకు తావునిస్తోంది. దక్షిణాదిలో ఎదగాలని ఉవ్విళ్లూరుతోన్న బీజేపీకి ఇతర పార్టీల అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులో పార్టీ బలపడడానికి పన్నీర్‭సెల్వంను తమవైపు లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు