ఢిల్లీ : గాంధీజీ కలలకు అనుగుణంగా భారత ప్రభుత్వం నడుచుకొంటోందని…అవినీతి రహిత పాలనను అందించడమే సర్కార్ లక్ష్యమని…2019 సంవత్సరం భారత్‌కు ఎంతో ముఖ్యమైందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభివర్ణించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అంబేద్కర్..గాంధీ సిద్ధాంతాలను అనుసరించి పనిచేయడం జరుగుతోందన్నారు. నైతికతే ఆదారంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్న ఆయన నవ భారత ప్రభుత్వ పథకాలకు సరికొత్త రూపమిచ్చామని ప్రసంగంలో తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని..రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సభకు తెలిపారు.
* అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం.
* నాలుగేళ్లలో ప్రజల ఆశయాలు..ఆకాంక్షలను నెరవేర్చాం.
* ఆయుష్మాన్ భారత్‌తో పేదలకు మెరుగైన వైద్యం.
* దేశంలో 9 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం.
* నిరుపేదలకు అందుబాటులో విద్యుత్, వంటగ్యాస్.
* 13 కోట్ల మందికిపైగా గ్యాస్ కనెక్షన్లు.
* 50 కోట్ల మందికి ఆరోగ్యపథకం అమలు.
* ప్రధాని బీమా యోజనతో 21 కోట్ల మందికి లబ్ది.
* తల్లి, సోదరీమణులకు ఉజ్వల్ యోజన ప్రయోజనాలు.
* గ్రామీణ ఆవాస్ యోజన కింద కోటికి పైగా ఇళ్ల నిర్మాణం.
* హృద్యోగులకు ఉపయోగించే స్టంట్ల ధరలను తగ్గించాం.
* కిడ్నీ బాధితుల కోసం ఉచితంగా డయాలసీస్ కేంద్రాలు.
* జన ఔషధి దుకాణాలలో ఔషధాల ధరలు తగ్గించాం.