Parliament Session : పార్లమెంట్ సమావేశాలు.. నలుగురు ఎంపీలు ప్రమాణస్వీకారం

సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వరకు ఇవి కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి

parliament sessions start on monday : సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వరకు ఇవి కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.. టీకా తీసుకోని వారికీ ఆర్టీపీఎస్ టెస్ట్ తప్పని సరి.

పార్లమెంట్ లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. పార్లమెంట్ హల్ లో 280 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. మరో 259 మందికి సందర్శుల గ్యాలరీలో కూర్చునేలా ఏర్పాటు చేశారు. రాజ్యసభలో కూడా సామాజిక దూరం పాటిస్తూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక సోమవారం కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలకు మధ్య మరణించిన 40 మంది మాజీ ఎంపీలకు లోక్ సభ సభ్యులు నివాళి అర్పించనున్నారు.

కాగా చనిపోయిన వారిలో తెలుగురాష్ట్రాలకు చెందిన అజ్మీరా చందూలాల్.. ఎం. సత్యనారాయణ. సబ్బం హరి ఉన్నారు. ఇక కొత్తగా ఎన్నికైన మంత్రులను లోక్ సభకు పరిచయం చేయనున్నారు మోదీ. 19 రోజులపాటు సాగే ఈ సమావేశాల్లో 15 కొత్త బిల్లులు, 9 పెండింగ్ బిల్లులు సహా ఆరు ఆర్డినెన్స్ లను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్రం

ట్రెండింగ్ వార్తలు