Parliament Winter Session 2023: లోక్‌సభ నుంచి మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.

MPs Suspended from Praliament

49 MPs Suspended from Praliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ సెషన్ లో ఉభయ సభల్లో సోమవారం వరకు 95 మంది సభ్యులను సస్పెన్డ్ చేయగా.. మంగళవారం మరో 49 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఫలితంగా ఈ సెషన్ లో సస్పెన్షన్ కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 141 మంది కి చేరింది. ఇవాళ సస్పెండైన వారిలో సుప్రియాసూలే, శశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం, మనీశ్ తివారీ, డింపుల్ యాదవ్, తదితరులు ఉన్నారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Also Read : CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కీలక బాధ్యతలు

లోక్ సభ లో దుండగుల చొరబాటు ఘటనతో పార్లమెంట్ మంగళవారం దద్దరిల్లిపోయింది. డిసెంబర్ 13 నాటి భద్రతా వైఫల్యం పై హోమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు సోమవారం పట్టుబట్టగా.. మంగళవారం సభ ప్రారంభం నుంచి విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఇదిలాఉంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ఓటమి ఎదురు కావడంతో ఆ ఓటమిని జీర్ణించుకోలేక విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నారని అన్నారు.

Also Read : MPs Suspended from Rajyasabha: లోక్‭సభ తర్వాత ఇప్పుడు రాజ్యసభ వంతు.. 34 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్

పార్లమెంట్ చరిత్రలో ఉభయ సభల్లో కలిపి ఒకే సెషన్ లో తొలిసారి ఏకంగా 141 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు పడింది. లోక్ సభలో గతవారం 13మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా.. సోమవారం మరో 33 మంది విపక్ష సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ సెషన్ లో లోక్ సభ నుంచి 95 మంది ఎంపీలపై వేటు పడింది. మరోవైపు రాజ్య సభ నుంచి 46 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటి వరకు 141 మంది విపక్ష ఎంపీలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు పడినట్లయింది.

గతంలో రాజీవ్ గాంధీ హయాంలో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ రికార్డును తిరగరాస్తూ.. మోదీ హయాంలో ఉభయ సభల నుంచి ఏకంగా 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు.