Parrot Viral
Cut parrot viral Video : అందాల రామచిలుకల్ని చూస్తే మైమరచిపోతాం. వాటి పలుకులు వింటే పరవశించిపోతాం. అల్లరి అల్లరిగా అరిచే రామచిలుకల అరుపులు చాలా వినసొంపుగా ఉంటాయి. చిలిపి చేస్టలు చేస్తూ మైమరపిస్తాయి. అటువంటి ఓ అందాల రామచిలుకమ్మ చేసే ఈ చిలిపి పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ముచ్చటైన తన ఈకలకు మరింత అందాలను అద్దాలనుకుంటోందీ చిలకమ్మ. దానికోసం అది చేసే పనులు చూస్తే నవ్వాగదు..ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.
ఈ వీడియోలో రామ చిలుక ఒక మిషన్ కట్ చేసినంత పర్ ఫెక్ట్ గా తన ముక్కుతో ఓ క్యాలెండర్ లోని పేపర్ను కట్ చేస్తోంది. అలా ఓ షేపు గా క్యాలెండర్ పేపర్ ను ముక్కుతో కట్ చేసి దాన్ని తన తోకకు ఈకలుగా పెట్టుకుంటోంది. క్యాలెండర్ పేపర్ ను ఒక పద్ధతిలో కట్ చేస్తూ… అలా కట్ చేసిన అందమైన భాగాన్ని ముక్కుతో పట్టుకుని… తన వెనుక భాగంలో తోకలా పెట్టుకుంటోంది.
ఈ వీడియో చూసిన వారంతా దాని క్రియేటివిటీకి తెగ మురిసిపోతున్నారు. పదే పదే ఈ వీడియోను చూస్తున్నారు. ఈ వీడియోలో ఈ రామచిలుక చిలిపి చేస్టలు చూసినవారంతా క్రియేటివిటీ మనుషులకే కాదు పక్షులకు కూడా ఉంటుందంటున్నారు. మరికొందరైతే..నువ్వే చక్కనిదానివి నీకు ఇంకా ఎందుకమ్మా ఈ డెకరేషన్లు అంటున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైల్డ్‌లైఫ్-0.2 పేజీలో షేర్ చేశారు. మరెందుకాలస్యం మీరూ ఈ రామచిలుకపై ఓ లుక్కేసుకోండి. వావ్..క్యూట్ పారెట్ అని అనకుండా ఉండలేరు కదూ..