చూస్తుండగానే వరదలో కొట్టకు పోయిన స్కూల్ బిల్డింగ్

  • Publish Date - July 14, 2020 / 04:30 PM IST

బీహార్ లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో కోషి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నేల కోతకు గురవడంతో నది ఒడ్డున ఉన్న ఓ స్కూల్‌ భవనం చూస్తుండగానే కుప్పకూలింది. ఈ సంఘటన భగల్‌పూర్‌లో జరిగింది.

భవన శిథిలాలు నదిలో కొట్టుకుపోయాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. పాఠశాల భవనం నదిలోకి జారిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.