×
Ad

Gujarat : గుజరాత్‌లో కూలిన వంతెన…నదిలో పడిన 10 మందిని రక్షించారు

గుజరాత్ రాష్ట్రంలో పాత వంతెన కూలిపోయిన ఘటనలో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సురేంద్రనగర్ జిల్లాలోని వస్తాడి ప్రాంతంలో పాత వంతెన కూలిపోవడంతో డంపర్, మోటారుసైకిళ్లతోపాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి.....

  • Published On : September 25, 2023 / 05:56 AM IST

Bridge Collapses

Gujarat : గుజరాత్ రాష్ట్రంలో పాత వంతెన కూలిపోయిన ఘటనలో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. సురేంద్రనగర్ జిల్లాలోని వస్తాడి ప్రాంతంలో పాత వంతెన కూలిపోవడంతో డంపర్, మోటారుసైకిళ్లతోపాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. (Bridge Collapses) బలహీనంగా ఉన్న వస్తాడి పాత వంతెనపై నుంచి డంపర్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో అది కాస్తా కూలిపోయింది.

Nigeria : నైజీరియాలో గన్‌మెన్ కాల్పుల్లో 14 మంది మృతి

వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో వాహనాల్లోని 10 మంది నదిలో పడిపోయారు. సహాయ సిబ్బంది సకాలంలో వారిని కాపాడారు. (Gujarat’s Surendranagar) పోలీసులు, అగ్నిమాపక దళం, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

First Wedding Photo : భార్యాభర్తలుగా ఎంపీ రాఘవ్ చద్దా, పరిణితీ చోప్రాల ఫస్ట్ ఫొటో

జాతీయ రహదారిని చుర తహసీల్‌కు కలుపుతూ భోగావో నదిపై నిర్మించిన వంతెన 40 ఏళ్ల నాటిదని జిల్లా కలెక్టర్ కె.సి.సంపత్ చెప్పారు. ఈ పాత వంతెనపైకి భారీ వాహనాల రాకపోకలను నిషేధించామని సంపత్ పేర్కొన్నారు. పాత వంతెనను ఇప్పటికే రోడ్లు భవనాల శాఖకు అప్పగించామని, కొత్త వంతెన నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చామని కలెక్టర్ వివరించారు.