Metro Train : మెట్రోలో మంచూరియా తిన్న ప్రయాణీకుడు, షాకిచ్చిన యాజమాన్యం

బెంగళూరు మెట్రో రైలులో ఓ ప్రయాణీకుడు మంచూరియా తిన్నాడు. గోబీ మంచూరియా తింటూ వీడియోకు పోజులిచ్చాడు. దీంతో సదరు ప్రయాణీకుడికి మెట్రో యాజమాన్యం షాకిచ్చింది.

Bengaluru Metro

Man Eats Manchurian In Bengaluru Metro Coach : బెంగళూరు మెట్రో రైలులో ఓ ప్రయాణీకుడు మంచూరియా తిన్నాడు. గోబీ మంచూరియా తింటూ వీడియోకు పోజులిచ్చాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇదికాస్తా అటు తిరిగి ఇటు తిరిగి మెట్రో యాజమాన్యం దృష్టికెళ్లింది. దీంతో సదరు ప్రయాణీకుడికి మెట్రో యాజమాన్యం షాకిచ్చింది. రూ.500 జరిమానా విధించింది. అంతేకాదు కేసు కూడా నమోదు చేసింది.

బెంగుళూరు మెట్రో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. దీంట్లో నగర మెట్రో నిబంధనల ప్రకారం రైళ్లలో ఆహారం తినటం, ప్లాట్‌ఫారమ్‌లపై భోజనం చేయడం నిషేధం. ఈ నిబంధనలు అతిక్రమించటంలో యాజమాన్యం పోలీసులకు సదరు ప్రయాణీకుడిపై ఫిర్యాదు చేసింది. రూ.500లు జరిమానా విధించింది.

Mahmood Ali : గన్‌మెన్‌ చెంప ఛెళ్లుమనిపించిన తెలంగాణ హోంమంత్రి

సునీల్ కుమార్ అనే వ్యక్తి జయనగర్- సంపిగె రోడ్డు స్టేషన్ల మధ్య ప్రయాణం చేస్తుంటాడు. ఈక్రమంలో ఓ రోజు మెట్రోలో తన స్నేహితులతో కలిసి మెట్రోలో ఆఫీస్ కు బయల్దేరాడు. ఈక్రమంలో మెట్రోలో మంచూరియా తిన్నాడు. అదంతా అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోలో అతనికి స్నేహితులు హెచ్చరించారు. ‘‘అన్ ఎడ్యూకేటడ్ ఫెలో.. మెట్రోలో జర్నీ చేస్తూ తింటున్నాడు” అంటూ వ్యాఖ్యానించటం స్పష్టంగా వినిపించింది. కానీ సునీల్ మాత్రం వినకుండా నవ్వుకుంటు మంచూరియాను తినటం కంటిన్యు చేశాడు. అతని స్నేహితులు ఇంకా కామెంట్స్ చేస్తుంటే అరె ఊరుకోరా అన్నట్లుగా సునీల్ అన్నట్లుగా కనిపిస్తోంది. ఆ తరువాత వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయటంతో యాజమాన్యం షాకిచ్చింది.