DGCA issues rules : విమాన ప్రయాణం..డీజీసీఏ రూల్స్, నిబంధనలు ఉల్లంఘిస్తే..నో ఎంట్రీ

వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల్లో నిబంధనలు కఠినతరం చేశారు.

Dgca

Covid rules : కరోనా కేసులు పెరుగుతుండంతో క్రమంగా అన్ని చోట్ల ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగ వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల్లో నిబంధనలు కఠినతరం చేశారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. లేదంటే విమానం నుంచి సదరు ప్రయాణికుడిని దించేస్తారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీసీఏ హెచ్చరించింది.

డీజీసీఏ తాజా నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులకు మాస్క్‌ తప్పనిసరి. ముక్కు కిందకు మాస్క్‌ ధరించడాన్ని నేరంగా పరిగణిస్తారు. అదే విధంగా ఎయిర్‌పోర్టు ప్రాంగణాల్లో సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి. సిబ్బంది హెచ్చరించినా మాస్కులు పెట్టుకోని ప్రయణికులను టేకాఫ్‌కు ముందే విమానం నుంచి దించేస్తారు. ప్రయాణం మధ్యలో కోవిడ్‌ నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తే .. సదరు ప్రయాణికుడిని నిషేధిత జాబితాలో చేరుస్తారు.

ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్‌ల దగ్గరే CISF, పోలీస్‌ సిబ్బంది ప్రయాణికులను గమనించాలి. మాస్క్‌ లేకుండా ఎయిర్‌పోర్టు లోపలికి ఎవర్నీ అనుమతించకూడదు. ఎయిర్‌పోర్టులోకి వచ్చిన … ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతలను ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ లేదా టర్మినల్ మేనేజర్‌లకు అప్పగించింది డీజీసీఏ.